ఎఫ్ఆర్వోపై దాడి.. రాజ్య‌స‌భ‌లో స్పందించిన‌ కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి

ఎఫ్ఆర్వోపై దాడి.. రాజ్య‌స‌భ‌లో స్పందించిన‌ కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి
x
Highlights

తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితపై జరిగిన దాడిఘటనపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. రాజ్యసభలో...

తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితపై జరిగిన దాడిఘటనపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. రాజ్యసభలో మాట్లాడిన ఆయన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత అటవీ శాఖదే అని ఇలాంటి ఘటనలు సహించేది లేదన్నారు. రాజ్యసభలో సోమవారంనాడు ఆయన మాట్లాడుతూ, అధికారులపై దాడులను తాము తీవ్రంగానే తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలను సరిచేయాల్సిన బాధ్యత తమకు ఉన్నందున అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories