క‌రోనాకు మందు గోమూత్రమే.. బీజేపీ ఎమ్మెల్యే

క‌రోనాకు మందు గోమూత్రమే.. బీజేపీ ఎమ్మెల్యే
x
Suman Haripriya
Highlights

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న అతి భయంకరమైన వ్యాధి కరోనావైరస్ .. ఇప్పటికి ఈ వ్యాధి బారినా పడి వేలాది మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ వైరస్ కారణంగా...

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న అతి భయంకరమైన వ్యాధి కరోనావైరస్ .. ఇప్పటికి ఈ వ్యాధి బారినా పడి వేలాది మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ వైరస్ కారణంగా చైనా ఇప్పటివరకు 2,912 మరణాలను చవిచూసింది. COVID-19 లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్న 37 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. ఈ భయంకరమైన వ్యాధికి మెడిసిన్ కనిపెట్టేందుకు ప్రపంచ శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అస్సాంలోని ఓ బీజేపీ ఎమ్మెల్యే దీనికి పరిష్కారం "గౌముత్రా" (ఆవు మూత్రం) మరియు "గోబార్" (ఆవు) పేడ) అంటూ వెల్లడించారు.

క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు కూడా ఆవు మూత్రం, ఆవు పేడ సహాయపడతాయని ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ అభిప్రాయపడ్డారు. "ఆవు పేడ చాలా సహాయకారిగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గోమూత్రం, ఆవుపేడను వినియోగిస్తున్నారు. అదే విధంగా గోమూత్రం, ఆవు పేడతో కరోనాను కూడా తరిమేయవచ్చని నేను నమ్ముతున్నాను" అని బంగ్లాదేశ్‌కు పశువుల అక్రమ రవాణాపై చర్చ సందర్భంగా ఆమె ఈ విషయాన్ని పేర్కొన్నారు.

ఆవును భారతదేశంలో పవిత్ర జంతువుగా పరిగణిస్తారని, అంతేకాకుండా చికిత్సా ప్రయోజనాల కోసం ఆవు మూత్రాన్ని ఉపయోగించడం భారతీయ సంస్కృతిలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉందని ఆమె అన్నారు. ఆవు పేడను సాంప్రదాయకంగా హిందూ మతపరమైన ఆచారాలు, మందులు, ఎరువు మరియు ఇంధనంతో సహా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇక బంగ్లాదేశ్‌కు పశువుల అక్రమ రవాణాపై ఆమె స్పందిస్తూ,.. ప్రధానంగా అస్సాం నుండి బంగ్లాదేశ్ కి ఆవుల అక్రమ రవాణా జరుగుతుందని, అందుకే అక్కడి ఆర్థిక వ్యవస్థ బలపడిందని హరిప్రియ అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆవుల అక్రమ రవాణాను ఆపడానికి ఏమీ చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. అక్రమ రవాణాకి ఈ రోజుల్లో నది మార్గాన్ని ఎంచుకొని రవాణా చేయడానికి ఉపయోగిస్తారని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలోని పశువుల మార్కెట్లను పర్యవేక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు హరిప్రియ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories