ఫిబ్రవరి14తో కేజ్రివాల్ కి విడదీయని అనుబంధం

ఫిబ్రవరి14తో కేజ్రివాల్ కి విడదీయని అనుబంధం
x
Highlights

తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతుంది. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కూడా అమ్ ఆద్మీ పార్టీ కనీసం పోటి కూడా...

తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతుంది. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కూడా అమ్ ఆద్మీ పార్టీ కనీసం పోటి కూడా ఇవ్వలేకపోతుంది. ముచ్చటగా మూడో సారి ఢిల్లీ పీఠాన్ని మరోసారి చేజెక్కించుకున్నారు అరవింద్ కేజ్రీవాల్.. ఆయితే అయన ఫిబ్రవరి14న ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి14తో ఆయనకి విడదీయరాని అనుభందం ఉంది. ఇంతకి ఏంటి అది చూద్దాం..

2013లో జరిగిన్న ఎన్నికల్లో బీజేపీ 31, ఆమ్ ఆద్మీ పార్టీ 28, కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ తో కలిపి కేజ్రీవాల్ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. డిసెంబర్ 28 న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, పొత్తు పార్టీ కాంగ్రెస్ తో విబేధాలు రావడంతో 49 రోజుల్లోనే కూలిపోయింది. అటు పిమ్మట కేజ్రీవాల్ 14 ఫిబ్రవరి 2014 న ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు.

అయన రాజీనామా అనంతరం 2015 లో మళ్ళీ ఎన్నికలు ప్రకటించారు. అప్పుడు 67 సీట్లు సాధించి పొత్తు లేకుండానే స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాలకి పరిమితం కాగా, కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది.. దీంతో ఆప్ ప్రతినిధి రాఘవ్ చాధా ఫిబ్రవరి 14 న రామ్‌లీలా మైదానంలో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రకటించారు. కేజ్రీవాల్ ఏరోజైతే పదవికి రాజీనామా చేశారో.. మళ్లీ అదే రోజు కేజ్రీవాల్ ఫిబ్రవరి 14 ఫిబ్రవరి 2015 న రెండవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇప్పుడు కూడా అయన ఫిబ్రవరి 14నే ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories