అరుణ్‌‌ జైట్లీ హెల్త్‌ బులెటిన్ రిలీజ్‌‌

అరుణ్‌‌ జైట్లీ హెల్త్‌ బులెటిన్ రిలీజ్‌‌
x
Highlights

తీవ్ర అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్‌‌లో చేరిన బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ రిలీజైంది. జైట్లీ...

తీవ్ర అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్‌‌లో చేరిన బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ రిలీజైంది. జైట్లీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న ఎయిమ్స్‌ వైద్యుల బృదం ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతోన్న జైట్లీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఇటీవలే కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్న జైట్లీకి హార్ట్‌ అండ్ కిడ్నీ స్పెషలిస్టులు చికిత్స చేస్తున్నారు.

అరుణ్‌ జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బీజేపీ అగ్రనాయకులు ఢిల్లీ ఎయిమ్స్‌కి క్యూకట్టారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌, హర్షవర్ధన్, లోక్‌‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తదితరులు ఎయిమ్స్‌‌కి వచ్చి జైట్లీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాధారణ చెకప్ కోసం ఈ ఉదయం ఢిల్లీ ఎయిమ్స్‌‌కి వచ్చిన అరుణ్‌ జైట్లీకి ఆరోగ్యం విషమించడంతో వైద్యులు... ఐసీయూకి తరలించి చికిత్స చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం జైట్లీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories