ఆర్టికల్‌ 370 రద్దుతో వచ్చే మార్పులు ఏమిటి..?

ఆర్టికల్‌ 370 రద్దుతో వచ్చే మార్పులు ఏమిటి..?
x
Highlights

జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల వచ్చే మార్పులు ఏమిటి..? అక్కడ అమలులోకి రానున్న కొత్త నిబంధనలు ఎలా ఉంటాయి..? సులభతరం అయ్యే...

జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల వచ్చే మార్పులు ఏమిటి..? అక్కడ అమలులోకి రానున్న కొత్త నిబంధనలు ఎలా ఉంటాయి..? సులభతరం అయ్యే అంశాలు ఏవీ..? ఒక సారి చూద్దాం. కశ్మీరుకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు చేయడంతో ఆ రాష్ట్రంలో అనేక మార్పులు జరుగనున్నాయి. గతంలో విధానాలు మారనున్నాయి. కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి.

ఇప్పటి వరకు రక్షణ, విదేశీ వ్యవహరాలు వంటివి మినహా ఇతర అన్ని అంశాల్లోనూ జమ్ము కశ్మీరు ప్రత్యేక అధికారాలు ఉండేవి. ఇకపై జమ్మూకశ్మీర్‌ కు ఎలాంటి ప్రత్యేక అధికారాలు ఉండవు. ఇప్పటి వరకు అక్కడి ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉండేది. జమ్మూకశ్మీర్‌ అమ్మాయి ఇతర రాష్ట్రం లేదా దేశ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే.. ఆమె కశ్మీర్‌ పౌరసత్వం రద్దు అయ్యేది. ఇకపై అక్కడ ప్రజలకు ఇకపై ఏక పౌరసత్వమే ఉంటుంది. జమ్మూకశ్మీర్‌ అమ్మాయి ఇతర రాష్ట్రం లేదా దేశ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు.

ఇప్పటి వరకు ఆర్థిక ఎమర్జెన్సీని విధించే ఆర్టికల్‌ 360, ఆర్టీఐ చట్టం ఈ రాష్ట్రానికి వర్తించేవి కావు. ఇకపై ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించే ఆర్టికల్‌ 360, సమాచార హక్కు చట్టం ఈ రాష్ట్రానికి కూడా వర్తిస్తాయి. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల వారు జమ్మూకశ్మీర్‌ ప్రజల ఆస్తులు, భూములు కొనకూడదు. ఇకపై ఇతర రాష్ట్రాల వారు కూడా జమ్మూకశ్మీర్‌ ప్రజల ఆస్తులు, భూములు కొనవచ్చు. గతంలో కశ్మీర్‌లో మైనారిటీ లకు రిజర్వేషన్లు లేవు. ఇకపై కశ్మీర్‌లో మైనారిటీలకు 16 శాతం రిజర్వేషన్లు ఉంటాయి.

ఇప్పటి వరకు ఆ రాష్ట్ర అసెంబ్లీ కాల పరిమితి ఆరు సంవత్సరాలు ఉండగా.. ఇకపై అసెంబ్లీ కాల పరిమితి ఐదు సంవత్సరాలు. ఇప్పటి వరకు జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఉండేది. ఇకపై ప్రత్యేక జెండా ఉండదు. ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్‌లో పంచాయతీలకు హక్కులు లేవు. ఇకపై ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టే కశ్మీర్‌లోని పంచాయతీలకు కూడా అన్ని హక్కులూ ఉంటాయి. గతంలో ఉచిత నిర్బంధ విద్య నిబంధన వర్తించేది కాదు. ఇకపై ఉచిత నిర్భంధ విద్య నిబంధన ఇక్కడ కూడా అమలవుతుంది. 370 ఆర్టికల్ రద్దుతో జమ్ముకశ్మీర్‌లో ఎన్నో మార్పులు రానున్నాయి. అక్కడ పాలన వ్యవహారంలో ఈ మార్పులు స్పష్టంగా కన్పించనున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories