అత్యాచార నిందితున్ని పట్టించిన ఫేస్‌బుక్‌

అత్యాచార నిందితున్ని పట్టించిన ఫేస్‌బుక్‌
x
Highlights

ఈ మధ్య కాలంలో పెరిగిన టెక్నాలజీ ఆధారంగా ఎలాంటి నేరాలు చేసిన వారినైనా పోలీసులు ఇట్టే పట్టుకుని అదుపులోకి తీసుకుంటున్నారు. అదే కోణంలో ఓ అత్యాచార నిందితుడిని ఇప్పుడు ఫేస్‌బుక్‌ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు.

ఈ మధ్య కాలంలో పెరిగిన టెక్నాలజీ ఆధారంగా ఎలాంటి నేరాలు చేసిన వారినైనా పోలీసులు ఇట్టే పట్టుకుని అదుపులోకి తీసుకుంటున్నారు. అదే కోణంలో ఓ అత్యాచార నిందితుడిని ఇప్పుడు ఫేస్‌బుక్‌ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు.

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. కొన్ని రోజుల క్రితం ఓ యువకుడు ఏడో తరగతి చదువుతున్న బాలికకు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. కొన్ని రోజుల పాటు వీరిద్దరి మధ్య చాటింగ్ లు నడిసాయి. కొన్ని రోజుల పరిచయం తరువాత ఆ యువకుడు ఆ అమ్మాయిని కలుద్దామని అడిగాడు. దీంతో ఆ అమ్మాయి కుడా సరే అని అంగీకరించింది. అనుకున్న వుధంగానే ఆ అమ్మాయిని కలవడానికి వచ్చిన అతను బాలికను కలవగానే బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. కొంతదూరం వెళ్ళాక ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడు.

కొన్ని రోజుల తరువాత ఆ అమ్మాయి కడుపునొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆమెను పరీక్షించిన వైద్యులు తను గర్భవతి అని చెప్పారు. దీంతో జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. విషయం తెలుసుకున్న బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తనపై అత్యాచారం చేసిన వ్యక్తి తనకు ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడని బాలిక పోలీసులకు తెలిపింది.

బాలిక ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నిందితుడిని రామన్‌ రాజ్‌పుత్‌గా పోలీసులు నిర్ధారించారు. అతని ఫేస్‌బుక్‌ అకౌంట్‌ పరిశీలిస్తే సుమారు 350 మంది అమ్మాయిలు తనకు ఫ్రెండ్స్‌గా ఉన్నారన్న విషయం బైట పడింది. ఎదో ఒక విధంగా నిందితుడిని పట్టుకోవాలని పిప్‌లానీ పోలీసులు పధకం పన్నారు. దీంతో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌ థాకేరాయ్‌ ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరు మీద నకిలీ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. రాజ్‌పుత్‌తో కొన్ని రోజులు అమ్మాయిలాగా చాట్‌ చేశాడు. ఆ తర్వాత భోపాల్‌లోని ఓ హోటల్‌లో కలుద్దామని రాజ్‌పుత్‌కు పోలీస్ చెపాడు. అక్కడికి వచ్చిన రాజ్ పుత్ ను సివిల్ డ్రెస్ లో వున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అదుపులోకి తీసుకున్నారు. అయితే మిగతా అమ్మాయిలతో కూడా రాజ్‌పుత్‌ చాట్‌ చేస్తూ ప్రయివేటుగా కలుద్దామని వేధించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందాని పోలీసులు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories