అంతరిక్షంలో నేడు మరో వింత

అంతరిక్షంలో నేడు మరో వింత
x
Highlights

అంతరిక్షంలో నేడు మరో వింత చోటు చేసుకోబోతుంది. గురువారం భూమిసూర్యుడికి దగ్గరగా చేరబోతోంది. చిన్నప్పుడు ఖగోళశాస్త్రం పుస్తకంలో చదువుకున్నట్టు సూర్యుడికి...

అంతరిక్షంలో నేడు మరో వింత చోటు చేసుకోబోతుంది. గురువారం భూమిసూర్యుడికి దగ్గరగా చేరబోతోంది. చిన్నప్పుడు ఖగోళశాస్త్రం పుస్తకంలో చదువుకున్నట్టు సూర్యుడికి భూమి సమీపంగా వెళ్లటాన్ని పెరిహిలియన్‌ అని, దూరంగా వెళ్లటాన్ని అపిలియన్‌ అని పిలుస్తుంటారు. గురువారం జరిగే ప్రక్రియను పెరిహిలియన్‌గా పిలవాలి. ఈ పెరిహిలియన్‌ ప్రక్రియ ప్రతిసంవత్సరం జరుగుతుంటుంది. ఏడాదిలో రెండు సార్లు ఈ పరిణామం చోటుచేసుకుంటుంది. సూర్యుడి చుట్టూ భూమి దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది. ఈ గమనంలో ఒకసారి సూర్యుడికి సమీపంగా, మరోసారి సూర్యుడికి దూరంగా వెళుతుంది.

ఈరోజు భూమి సూర్యుడికి సమీపంగా వెళుతుంది. అయితే జీవుల కంటికి నేరుగా కనిపించని ఈ ఘటన ఖగోళపరంగా చాలా ప్రాముఖ్యమైనదని అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి సూర్యుడికి దగ్గరగా వెళుతోంది కాబట్టి ఈరోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ అభిప్రాయాన్ని ఖగోళ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. భూమి సూర్యుడికి దగ్గరగా వస్తున్నప్పటికీ మనతో సహా ఉత్తర ధృవంలోనూ చలికాలమే కొనసాగుతోంది. జూలైలో భూమి సూర్యుడికి దూరంగా వెళ్లే ఘటన చోటు చేసుకుంటుంది. సూర్యుడికి, భూమికి మధ్య దూరం తగ్గటం వల్ల రుతువులు ఏర్పడతాయని నానుడి ఉంది. అయితే ఇది కూడా అవాస్తవం. దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతున్నప్పుడు భూమి వాలే తీరును బట్టి కాలాలు, రుతువులు ఏర్పడతాయి. తప్ప పెరిహిలియన్‌ వల్ల వాతావరణంపై ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories