ముగిసిన ఆంధ్రా బ్యాంకు చరిత

ముగిసిన ఆంధ్రా బ్యాంకు చరిత
x
Highlights

ఆంధ్రా బ్యాంకు కథ ముగిసింది. యూనియన్ బ్యాంకులో విలీనమైంది. ఇక అది చరిత్రగానే మిగలనుంది. బ్యాంకుల్లో ఆంధ్రాకు మిగిలి వున్న ఒక్కగానొక్క ఐడెంటిటీ...

ఆంధ్రా బ్యాంకు కథ ముగిసింది. యూనియన్ బ్యాంకులో విలీనమైంది. ఇక అది చరిత్రగానే మిగలనుంది. బ్యాంకుల్లో ఆంధ్రాకు మిగిలి వున్న ఒక్కగానొక్క ఐడెంటిటీ పోయింది. చారిత్రక ఆంధ్రా బ్యాంకుని ఇతర బ్యాంకుల్లో విలీనం చేయొద్దన్న వినతులను లెక్కచేయకుండా కేంద్రం యూనియన్ బ్యాంకులో విలీనం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రాజ్యసభ సభ్యుడు కెవిపి రాసిన లేఖ కూడా పని చేయలేదు.

ఇది ఆంధ్రా బ్యాంకు చరిత్ర

1923, నవంబరు 20 న ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో స్థాపించాడు. 1980లో ఈ బ్యాంకు జాతీయం చేశారు. 1981లో దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను ఈ బ్యాంకు పరిచయం చేసింది. 2003 నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది. 2007లో బయోమెట్రిక్ ఏటిఎంలను దేశానికి పరిచయం చేసింది. 2007 సెప్టెంబర్ నాటికి ఈ బ్యాంకు 1,289 బ్రాంచీలతో 99 ఎక్స్‌టెన్షన్ శాఖలతో, 37 శాటిలైట్ ఆఫీసులతో, 505 ఏటిఎంలతో, 22 రాష్ట్రాలలో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించింది. పెట్టుబడులను రాబట్టటంలో ఈ బ్యాంకు ఆసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం మొత్తంలో ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 1.372 కోట్ల ఖాతాదారులు ఉన్నారు. ప్రారంభం నుండి నేటి వరకు మొత్తం ఋణాలలో కనీసం 50 శాతానికి తగ్గకుండా రుణాలను గ్రామీణ భారతానికే అందిస్తున్న బ్యాంక్ ఇది.

దెబ్బతిన్న ఆంధ్రుల మనోభావాలు

బ్యాంకు విలీనం అనివార్యమైతే ఆంధ్రా బ్యాంకులోనే ఇతర బ్యాంకులను కలపాలన్న వినతిని కూడా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినేలా నిర్ణయం జరిగిపోయింది. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న ఆంధ్రా బ్యాంకు కాస్తా, చివరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న ఆంధ్రుల కోడలు నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ముగిసిపోవడమే విచారకరం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories