logo
జాతీయం

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌
X
Highlights

జమ్మూకశ్మీర్ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అనంత్‌నాగ్ జిల్లా వాగ్ హోం ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం...

జమ్మూకశ్మీర్ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అనంత్‌నాగ్ జిల్లా వాగ్ హోం ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపగా, జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎంత మంది మరణించారనేది ఇంకా తెలియరాలేదు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వాగ్ హోం ప్రాంతంలో గాలిస్తున్నాయి. మరోవైపు అనంత్‌నాగ్‌ జిల్లా అచాబల్‌ ప్రాంతంలో నిన్న భద్రతాదళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ఉగ్రవాది అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మరో ఆర్మీ మేజర్‌, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఒకవైపు ఎన్ కౌంటర్లు, పుల్వామాలో ఉగ్రవాదుల దాడులు, సరిహద్దుల్లో పాక్ సైనికుల కాల్పులతో జమ్మూకశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story