కదులుతున్న రైల్లో వికటించిన విన్యాసం..మృత్యు ఒడి చేరిన యువకుడు!

కదులుతున్న రైల్లో వికటించిన విన్యాసం..మృత్యు ఒడి చేరిన యువకుడు!
x
Highlights

కుర్రతనం అంటే ఇలానే ఉంటుంది అంటారు చాలామంది కుర్రాళ్ళు. వారి దూకుడుతో తల్లిదండ్రులకు నిద్ర పట్టనీయరు. వాళ్ళున్న చోట ఉన్న జనాలకు స్థిమితం ఉండనీయరు....

కుర్రతనం అంటే ఇలానే ఉంటుంది అంటారు చాలామంది కుర్రాళ్ళు. వారి దూకుడుతో తల్లిదండ్రులకు నిద్ర పట్టనీయరు. వాళ్ళున్న చోట ఉన్న జనాలకు స్థిమితం ఉండనీయరు. అల్లరి మానరు. సాహసాలు అంటూ దుందుడుకు పనులు చేయడం ఆపారు. అలాంటి వారికి హెచ్చరిక ఈ వార్త. కుర్రతనం విన్యాసాలు చేస్తూ రైల్లో ఆపాదపాలైన కుర్రాడి కథ ఇది. అల్లరి చేష్టలకి దిగే కుర్రకారుకు పాఠం ఇది.

సాధారణంగా చాలా మంది యువత ప్రయాణాలు చేసేటప్పుడు కుదురుగా ఉండరు. ముఖ్యంగా రైళ్లో ప్రయాణం చేసే సమయంలో స్టేషన్ వచ్చిన ప్రతీ సారీ ట్రైన్ దిగుతూ, ఎక్కుతూ ఉంటారు. అది చాలదన్నట్టు కదిలే రైలు నుంచి బయటికి వేళాడుతూ వెక్కిలి చేష్టలు చేస్తూ ఉంటారు. ఎంత మంది పెద్దవారు చెప్పినా అస్సలు వినరు. అలా చేస్తూ వారి ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. క్షణాల్లో ప్రాణాలు పోతున్నా, ఎన్ని వార్తలను విన్నా కొంతమంది యువకులు మాత్రం మారడం లేదు. హద్దు, పద్దూ లేకుండా సాహసాలకు లేనిపోని సాహసాలను చేసి వారి ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు చేతికందొచ్చిన వారి బిడ్డలను దూరం చేసుకుని ఆవేదనకు గురవుతున్నారు.

ఇదే క్రమంలో తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రమాదమని తెలిసి కూడా కదులుతున్న రైలు డోర్‌ వద్ద నిలబడి బయటకు వేలాడుతూ ఫీట్‌ చేశాడో యువకుడు. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత ఫిల్లర్ ఆ యువకుడి తలకు తగిలి ట్రైన్ నుంచి కిందపడిపోయి ప్రాణాలనే వదిలేసాడు. సరదాగా స్నేహితుల ముందు చేసిన ఈ ఫీట్ తో అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ఈ సంఘటన పూర్తివివరాల్లోకెళితే మహారాష్ట్రలోని కల్యాన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దిల్షాన్ ‌(20) అనే యువకుడు తన సోదరుడి వివాహానికి కొత్త బట్టలు కొనేందుకు స్నేహితులతో కలిసి రైల్లో గోవాండీకి బయల్దేరాడు. ఇదే సమయంలో అతని స్నేహితులను వీడియో తీయమని చెప్పి తాను ఎక్కిన బోగి ద్వారం వద్ద స్టంట్‌లు చేస్తున్నారు. అదే సమయంలో ఓ ఫిల్లర్ కు అతని తల తగిలింది. దీంతో దిల్షాన్‌ అక్కడే కిందపడి మృతి చెందాడు. ఇంకే ముంది కొద్ది రోజుల్లో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇక అతను చేస్తు్న్న స్టంట్లను వీడియో తీసిన స్నేహితులు ఈ వీడియోను రైల్వే శా‌ఖకు అందించారు. దీంతో స్వయంగా రైల్వే మంత్రిత్వ శాఖ వీడియోని ట్వీట్‌ చేసింది. రైలులో ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేయవద్దు, ఇది చట్టవిరుద్ధమని తెలిపింది. ఇలాంటి స్టంట్స్ ద్వారా తమ ప్రాణాలు కూడా పోతాయని పోతాయని ప్రయాణికులను వారించింది. ఇప్పటికైనా యువత ఇలాంటి స్టంట్లను మానుకోవాలని హెచ్చరించింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories