Top
logo

తెలంగాణతో సుష్మాస్వరాజ్‌కు విడదీయలేని అనుబంధం

తెలంగాణతో సుష్మాస్వరాజ్‌కు విడదీయలేని అనుబంధం
X
Highlights

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మాస్వరాజ్ పాత్ర మరువలేనిది. తెలంగాణ చిన్నమ్మగా... ఆమె ఎప్పటికీ గుర్తుండిపోతారు....

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మాస్వరాజ్ పాత్ర మరువలేనిది. తెలంగాణ చిన్నమ్మగా... ఆమె ఎప్పటికీ గుర్తుండిపోతారు. తెలంగాణతో అనుబంధం పెంచుకున్న సుష్మా.... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిచ్చారు. అంతేకాదు తెలంగాణ కోసం పార్లమెంట్‌లో బలమైన వాణి వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీజేపీ జాతీయ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన కృషి వెలకట్టలేనిది.. ప్రతిపక్ష నేతగా పార్లమెంటులో సుష్మ స్వరాజ్ అనేక మార్లు తెలంగాణ వాణిని వినిపించారు. తెలంగాణ ప్రజల గొంతును వినాలని ఆమె పార్లమెంటులో డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కళ్లకు కట్టినట్లు పార్లమెంటులో వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడంలో కూడా ఎంతో కృషి చేశారు.. తెలంగాణ చిన్నమ్మగా తనను గుర్తు పెట్టుకోవాలని ఆమె పార్లమెంటు వేదికగా కోరారు. 2017 నవంబర్ లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో.. విదేశాంగ శాఖ మంత్రి గా పాల్గొన్న సుష్మా ఆ సమయంలో తెలంగాణను అభివర్ణిస్తూ తనను అందరూ తెలంగాణ చిన్నమ్మ అని పిలుస్తారని తెలిపారు.. తనకు తెలంగాణ సంస్కృతి సుపరిచితమని కూడా తెలిపారు.

Next Story