కాసేపట్లో పార్లమెంట్ ముందుకు పౌరసత్వ చట్ట సవరణ బిల్లు.. టీఆర్‌ఎస్‌ ఎంపీలకు విప్ జారీ

కాసేపట్లో పార్లమెంట్ ముందుకు పౌరసత్వ చట్ట సవరణ బిల్లు.. టీఆర్‌ఎస్‌ ఎంపీలకు విప్ జారీ
x
అమిత్‌ షా
Highlights

పౌరసత్వసవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌,...

పౌరసత్వసవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌లో మత పీడనకు గురై అక్కడి నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. దీనిపై చర్చించి, బిల్లుకు ఆమోదం కూడా తెలపాలని భావిస్తున్నారు. ఇప్పటికే మూడు రోజుల పాటు సభకు సభ్యులంతా తప్పని సరిగా హాజరవ్వాలంటూ బీజేపీ తమ సభ్యులకు విప్ జారీ చేసింది.

లోక్‌సభ, రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఇవాళ, రేపు పార్లమెంట్‌కు తప్పకుండా హాజరుకావాలని విప్ జారీ అయింది. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఎంపీలకు సూచించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories