లాల్‌చౌక్‌లో అమిత్ షా.. లద్దాఖ్‌లో ధోనీ

లాల్‌చౌక్‌లో అమిత్ షా.. లద్దాఖ్‌లో ధోనీ
x
Highlights

73వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా.. సర్వం సిద్ధమయ్యారు. దేశరాజధాని ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాలు పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబయ్యాయి. లాల్‌చౌక్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. లద్దాఖ్‌లో ధోనీ జాతీయ జెండా ఎగరవేయనున్నారు.

73వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా.. సర్వం సిద్ధమయ్యారు. దేశరాజధాని ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాలు పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబయ్యాయి. లాల్‌చౌక్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. లద్దాఖ్‌లో ధోనీ జాతీయ జెండా ఎగరవేయనున్నారు. దేశవ్యాప్తంగా ఎలాంటి అవాంచనీ ఘటనలు చోటు చేసుకోకుండా.. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగష్టు 15న భారత దేశం 73వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నది. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ పంద్రాగట్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పంద్రాగస్టు వేళ తీవ్రవాదులు దాడులకు పాల్పడవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో దేశ రాజధాని దిల్లీతో సహా దేశ వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. జనరద్దీ కలిగిన ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలు గస్తీ కాస్తున్నాయి. వాహన తనిఖీలు, హోటళ్లను జల్లెడపడుతున్నారు. గగనతలంపై కూడా ప్రత్యేక నిఘా పట్టారు.

దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలు భద్రత ను కేంద్రం కఠినతరం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండ భద్రతను పటిష్టం చేయాలని కేంద్రం ఆదేశించింది. మెట్రో సిటీస్ లోని మెట్రో స్టేషన్లు, టెంపుల్స్, షాపింగ్ మాల్స్ సహా సున్నితమైన ప్రదేశాల్లో భద్రత ను కఠినతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రధాని మోడీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేస్తారు. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో రెండు రకాల జెండాలు ఎగిరేవి. ఇకపై కేవలం జాతీయ జెండా ఒక్కటే ఎగురవేస్తారు. ఆగస్టు 5 వ తేదీన జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు చేయడంతో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా ఇండియాలో అంతర్భాగం అయ్యింది. జమ్మూ కాశ్మీర్ పూర్తిగా అంతర్భాగం అయ్యాక మొదటసారి జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.

స్వాతంత్ర దినోత్సపు వేడుకలకు కాశ్మీర్లోని లాల్ చౌక్ సిద్ధం అవుతున్నది. లాల్ చౌక్‌లో అమిత్ షా జాతీయ జెండా ఎగరవేయబోతున్నారు. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ జమ్మూ కాశ్మీర్లో ఉండి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కశ్మీర్‌లో అన్ని పంచాయతీ ఆఫీసులపై జాతీయ జెండా ఆవిష్కరణ జరగనుంది. ఇందు కోసం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో జమ్మూకశ్మీర్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కళాకారుల బృందాలతో జమ్మూకశ్మీర్‌లో సందడి నెలకొంది. కర్ణాటక వరద బీభత్సవం నుంచి ఇప్పడిప్పుడే తేరుకుంటుంది. వరదల నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సాధారణంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరదల వల్ల ఇప్పటివరకు రాష్ట్రంలో 54 మంది మృతిచెందారు. 4 లక్షల మందిని ఒక వెయ్యి 151 పునరావాస కేంద్రాల్లోకి తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories