అఖిలపక్ష సమావేశంలో ఐదు అంశాలపై ప్రధానంగా చర్చ

అఖిలపక్ష సమావేశంలో ఐదు అంశాలపై ప్రధానంగా చర్చ
x
Highlights

ఐదు ప్రధాన అంశాలు. 24 రాజకీయ పార్టీలు. 4 గంటల పాటు విస్త్రృత చర్చ. మొత్తంగా ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం...

ఐదు ప్రధాన అంశాలు. 24 రాజకీయ పార్టీలు. 4 గంటల పాటు విస్త్రృత చర్చ. మొత్తంగా ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ముఖ్యంగా జమిలి ఎన్నికలకు సగానికి పైగా పార్టీలు మద్దతు తెలపగా ఎంఐఎం, వామపక్షాలు వ్యతిరేకించాయి.

ఢిల్లీలో జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశం సుమారు 4 గంటల పాటు సాగింది. మొత్తం 40 పార్టీలను ఆహ్వానిస్తే 24 పార్టీలు హాజరయ్యాయి. సగానికి పైగా పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపాయి. ఇందులో టీఆర్ఎస్, వైసీపీ కూడా ఉన్నాయి. అయితే ఎంఐఎం, సీపీఐ, సీపీఎం మాత్రం జమిలి ఎన్నికలను వ్యతిరేకించాయి. భేటీకి కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, టీఎంసీ, డీఎంకే దూరంగా ఉన్నాయి.

అఖిల పక్ష భేటీకి 21 పార్టీల అధ్యక్షులు హాజరుకాగా అందులో ముగ్గురు లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంపై ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. నిర్దిష్ట కాల పరిమితిలో ఈ కమిటీ నివేదిక ఇస్తుందని స్పష్టం చేశారు. అయితే ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారో కూడా ప్రధానే నిర్ణయించనున్నారు.

ప్రధానంగా ఐదు అంశాలపై ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరింది. ఇందులో ఒకే దేశం ఒకే సారి ఎన్నికలు అంశాన్ని వామపక్షాలు, ఎంఐఎం వ్యతిరేకించాయి. జమిలి ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ జై కొట్టింది. సమావేశానికి హాజరైన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తమ పార్టీ అభిప్రాయాన్ని ప్రధానికి తెలియజేశారు. జమిలి ఎన్నికలు జరిగితే కోట్ల రూపాయలు ఆదా అవుతాయని, అలాగే మాటిమాటికి ఎన్నికల కోడ్ చిక్కులు ఉండవని అన్నారు కేటీఆర్. మొత్తానికి సగానికి పైగా పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు పలకడంతో వీటి నిర్వహణకు ఒక అడుగు ముందుకు పడిందనే చెప్పాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories