'కరోనా రన్‌-40' ఓ యువకుడి వినూత్న ప్రయత్నం

కరోనా రన్‌-40 ఓ యువకుడి వినూత్న ప్రయత్నం
x
Student Run For Corona Program
Highlights

ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా గురించి సరైన సమాచారం లేకుండా ప్రచారం చేయవద్దని పోలీసులు, ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా గురించి సరైన సమాచారం లేకుండా ప్రచారం చేయవద్దని పోలీసులు, ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నారు. అందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఇంకా చాలా మంది గందరగోళ పరిస్థితిలోనే ఉంటున్నారు. కాస్త జ్వరం, దగ్గు వచ్చిందంటే భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ ప్రజలకు ఏదో రకంగా కరోనా వైరస్ పై స్పష్టమైన అవగాహన కల్పించాలనుకుంటున్నాడు బెంగులూరుక చెందిన యువ ఎంటర్‌ప్రెన్యూర్‌ సంతోష్‌. ఇతను 'కరోనా రన్‌-40' అనే అవేర్ నెస్ కార్యక్రమాన్ని చేపట్టాడు. నగరంలో ఉన్న ప్రజలకు అవగాహన కలగాలని అతను ప్రతి రోజు 40 కిలోమీటర్ల దూరం వాకింగ్ చేస్తున్నారు.

సంతోష్‌ మిశ్రా వ్యాపార రంగంలో మంచి గుర్తింపు ఉన్న యువకుడు మాత్రమే కాదు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కూడా. చదువురాని వాల్లు, చదువుకున్న వాల్లు కూడా వైరస్ పట్ల అపోహల్ని నమ్ముతున్నారని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెపుతున్నారు అతను. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం 4 గంటలకు లాపెల్లె రోడ్‌, ఎంజీ రోడ్‌, బ్రిగేడ్‌ రోడ్‌, కోరుమంగళ, హెచ్‌ఎస్‌ఆర్‌ లే-అవుట్‌ వంటి ప్రధాన ప్రాంతాలను చుట్టేసారు.

అదే విధంగా ఆదివారం కూడా అతను మరో 40 కిలోమీటర్లు పరులు తీసారు. రన్నింగ్, వాకింగ్‌ చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయన అంటున్నారు. దీంతో ఆరోగ్యమైన జీవితాన్ని గడపవచ్చని చెపుతున్నారు. 'Corona Karona.. Jogging Karona.. Healthy Rahona Bilkul Darona.. Say no to panic, Yes to precautions అనే సందేశాలను తన టీషర్టుపై పొందుపరిచారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories