బంగారమే బంగారం .. ఇంట్లో కాదు ఆమె కడుపులో

బంగారమే బంగారం .. ఇంట్లో కాదు ఆమె కడుపులో
x
Highlights

* మతిస్థిమితం లేకా బంగారం , నాణేలను మింగినా మహిళా* కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిక .. వైద్యుల సహకారంతో బయటపడ్డ నిజం పోలిసుల నుండి తప్పించుకునేందుకు...

  • * మతిస్థిమితం లేకా బంగారం , నాణేలను మింగినా మహిళా
  • * కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిక .. వైద్యుల సహకారంతో బయటపడ్డ నిజం

పోలిసుల నుండి తప్పించుకునేందుకు కొందరు బంగారాన్ని మరియు మాదకద్రవ్యాలను కడుపులో పెట్టుకొని వస్తారు . దాదాపుగా ఇలాంటివి మనం సినిమాల్లోనే చూసి ఉంటాం కానీ ఓ మహిళా మాత్రం తన కడుపులో చాలా బంగారం దాచుకుంది . ఈ విషయం ఆపరేషన్ చేస్తే బయటపడింది . పచ్చిమబెంగాల్ లో ఉంటున్న ఓ మహిళా గత కొద్దిరోజుల నుండి కడుపు నొప్పితో బాధపడుతుంది . అ మహిళను ఆమె తల్లి ఆసుపత్రికి తీసుకువెళ్ళగా ఆమె కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు .

వాటిని తీసే క్రమంలో వారికీ ఆశ్చర్యపోయే నిజాలు బయటపడ్డాయి . ఆమె కడుపులో నుండి చాలా రకాలైన బంగారు వస్తువులు బయటపడ్డాయి . అంతే కాకుండా నాణేలు కూడా కనిపించాయి . ఇదే విషయాన్ని వైద్యులు ఆమె తల్లికి వివరించారు . అయితే గతంలో తమ ఇంట్లో వస్తువులు పోయాయని పోలిస్ స్టేషన్ లో పలుమార్లు కంప్లేంట్ కూడా ఇచ్చామని, మతిస్థిమితం లేకా తానే ఇలా చేస్తుందని అనుకోలేదని ఆమె తల్లి వివరిచారు .

గత కొద్దిరోజులుగా తన కూతురు ఎం తిన్నాకూడా వాంతులు చేసుకునేదని , పలు ఆసుపత్రిలో తిరిగినా కూడా ఎం లాభం లేకుండా పోయిందని చివరికి ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు గుర్తించి వైద్యం చేసి వాటిని బయటకు తీసారని ఆమె వెల్లడించింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories