తప్పతాగి మహిళ గొడవ .. ట్రాఫిక్ పోలీస్ పై దురుసుగా ప్రవర్తన

తప్పతాగి మహిళ గొడవ .. ట్రాఫిక్ పోలీస్ పై దురుసుగా ప్రవర్తన
x
Highlights

తప్ప తాగారు . రోడ్డు పైన హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు . తన కర్తవ్యాన్ని సరిగ్గా నిరవర్తించిన ఓ ట్రాఫిక్ పోలీస్ పైన దురుసుగా ప్రవర్తించారు . అంతేకాదు...

తప్ప తాగారు . రోడ్డు పైన హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు . తన కర్తవ్యాన్ని సరిగ్గా నిరవర్తించిన ఓ ట్రాఫిక్ పోలీస్ పైన దురుసుగా ప్రవర్తించారు . అంతేకాదు అతని పై చేయిజేసుకున్నారు.. ఈ ఘటన నిన్న సాయింత్రం ఢిల్లీ లోని మాయాపురిలో చోటు చేసుకుంది . తాగినా మైకంలో హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డుపై వెళ్తున్న ఓ ఇద్దరినీ ట్రాఫిక్ పోలీస్ అడ్డుకున్నాడు . దీనితో వారు పోలీస్ అధికారి పై రెచ్చిపోయారు . స్కూటీ వెనుక కూర్చున్న మహిళ అయితే తమని వెళ్ళనివ్వాలని గట్టిగా కేకలు వేసింది . స్కూటీ తాళం చెవిని లాకున్న ట్రాఫిక్ పోలీస్ పై చేయిజేసుకొని అతని దగ్గరి నుండి తాళం చెవిని లాకున్నారు.. అయితే ట్రాఫిక్ పోలీస్ పైన దురుసుగా ప్రవర్తించినందుకు గాను వారిపై కేసు నమోదు చేసి రాత్రి అరెస్ట్ చేసారు . ఇందులో బైక్ నడిపిన వ్యక్తిగా అనిల్ పాండే, వెనుక ఉన్న మహిళ పేరు మాధురిగా గుర్తించారు .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories