వృద్ధుడి ప్రాణం కాపాడిన సెల్ఫీ..

వృద్ధుడి ప్రాణం కాపాడిన సెల్ఫీ..
x
Highlights

ఈ మధ్యకాలంలో సెల్ఫీల పిచ్చితో చాలా ప్రాణాలు తీసుకోవడమో లేక ప్రాణాల మీదకు తెచ్చుకోవడమో చూసిన ఘటనలు చాలానే ఉన్నాయి.

ఈ మధ్యకాలంలో సెల్ఫీల పిచ్చితో చాలా ప్రాణాలు తీసుకోవడమో లేక ప్రాణాల మీదకు తెచ్చుకోవడమో చూసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చదివే వార్త మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే.. ఈ మాయదారి సెల్ఫీలే ప్రాణాలు తీస్తున్నాయని అని గగ్గోలు పెడుతుంటారు పెద్దలు. అయితే ఈ సెల్ఫీఏ ఓ వృద్దుడి ప్రాణాలు కాపాడి ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు పొందుతోంది. ఇక వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని దావనగెరె జిల్లా హరిహర తాలుకాలో తుంగభద్ర నది వంతెనపై నుంచి ఆ యువకుడు వెళుతుండగా.. ఆ ప్రాంతం ఆ వ్యక్తికి విపరితంగా నచ్చేసింది. అక్కడి వరద ప్రవాహం, ఆనకట్టలతో కలిపి అతను సెల్ఫీ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు.

ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన సెల్ ఫోన్ తీసి ఫటాఫట్ క్లిక్‌లు మొదలు పెట్టాడు. అయితే అతడు సెల్ఫీలు తీసుకునే క్రమంలో రోడ్డుకు అవతలివైపున ఓ వృద్ధుడు నదిలోకి దూకేందుకు రేడీ అయినట్టు అతడికి సెల్ ఫోన్ లో కనిపించింది. వెంటనే వెనకకు తిరిగి చూసే సరికి నిజంగానే ఆ పెద్దాయన ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు క్లీయర్‌గా అర్థమైంది. దీంతో చేసేది ఏం లేక వెంట వెంటనే గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్నవారంతా వచ్చి అక్కడ గుమి కూడడంతో అసలు విషయం వారికి అర్ధం అయింది. దీంతో అక్కడికి చేరకున్న వారంతా.. ఆ వృద్ధుడిని కాపాడారు. కాగా ఇప్పుడు ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ సెల్ఫీ పోటోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రాణం పోసిన సెల్ఫీ అంటూ పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories