పబ్లిక్ టాయిలెట్స్ లోనే ఆమె నివాసం ... అదే ఆమెకి జీవనోపాధి

పబ్లిక్ టాయిలెట్స్ లోనే ఆమె నివాసం ... అదే ఆమెకి జీవనోపాధి
x
Highlights

చెన్నైలోని కరుప్పై(65) అనే ఓ మహిళ మాత్రం గత 19 సంవత్సరాల నుండి పబ్లిక్ టాయిలెట్‌లోనే నివాసం ఉంటుంది .

మనం మంచి రూమ్ లో ఉంటేనే అడ్జస్ట్ అవడం కష్టంగా మారిపోతుంది .హాల్ చిన్నగా ఉంది . వంటింట్లో కావాల్సిన సదుపాయాలు లేవు . అటాచ్ బాత్రూమ్ లేదని అంటూ ఉంటాం .. కానీ చెన్నైలోని కరుప్పై(65) అనే ఓ మహిళ మాత్రం గత 19 సంవత్సరాల నుండి పబ్లిక్ టాయిలెట్‌లోనే నివాసం ఉంటుంది . పబ్లిక్ టాయిలెట్‌లో ఉన్న ఓ చిన్న గదిలో నివాసం ఉంటూ అక్కడ ప్రతిరోజు అ టాయిలెట్‌ లను శుభ్రం చేస్తూ వచ్చే డబ్బలతో తన జీవితాన్ని గడుపుతుంది. ఓ ప్రముఖ ఛానల్ ఆమెని కలిసి ఆమె గురించి తెలుసుకోగా ఈ విషయాలు బయటపడ్డాయి ..

దీనిపైన కరుప్పై మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను . రోజు అ టాయిలెట్‌ లను కడిగితే ఎనబై నుండి తొంబై రూపాయలతో వచ్చిన డబ్బులతో జీవితాన్ని గడుపుతున్నాను . నాకు వృద్ధాప్య పెన్షన్ కావాలని కలెక్టర్ ని సంప్రదించినప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. తనకి ఓ కూతురు ఉన్నప్పటికీ నన్ను చూడడానికి ఎప్పుడు రాదు అని చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యింది కరుప్పై ... ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి...



Show Full Article
Print Article
More On
Next Story
More Stories