భార్యభర్తల మధ్య చిచ్చు పెట్టిన లడ్డులు... ఏకంగా విడాకులే

భార్యభర్తల మధ్య చిచ్చు పెట్టిన లడ్డులు... ఏకంగా విడాకులే
x
Highlights

తన భర్తకి ఆరోగ్యం బాలేకపోవడంతో తన భార్య ఓ తాంత్రికుడిని సంప్రదించింది .. అ తాంత్రికుడి ఆమెకి నీ భర్తకు రోజుకు నాలుగు లడ్డులని మాత్రమే పెట్టమని చెప్పుకొచ్చాడు .

ప్రస్తుతం భార్య వంట చేస్తే హాయిగా తినేసి ఆఫీస్ కి వెళ్ళే భర్తలను చూసి ఉంటాం .. అది కాకుంటే భార్య వంట చేయడం లేదని గోల చేసే భర్తలను చూసి ఉంటాం .. ఓ భర్త మాత్రం తన భార్య రోజు లడ్దులే పెడుతుందని విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కాడు . ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది . తన భర్తకి ఆరోగ్యం బాలేకపోవడంతో తన భార్య ఓ తాంత్రికుడిని సంప్రదించింది .. అ తాంత్రికుడి ఆమెకి నీ భర్తకు రోజుకు నాలుగు లడ్డులని మాత్రమే పెట్టమని చెప్పుకొచ్చాడు . తాంత్రికుడు చెప్పిన సలహా మేరకు ఆమె అలగే చేసుకుంటూ వచ్చింది . ఇలా కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నా అ తరవాత భార్య పద్ధతిపై విసుకు వచ్చిన అ భర్త తన భార్యతో కాపురం చేయలేనని దయచేసి విడాకులు ఇవ్వాల్సిందిగా కోర్టుని ఆశ్రయించాడు . ఇది విన్న నాయస్థానం ఆశ్చర్యపోయింది . అంతే కాకుండా దీనిపైన అ భార్య చెప్పిన సమాధానం విన్నాక నాయస్థానాన్ని మరింత ఆశ్చర్యపరిచింది . అలా లడ్డులు పెట్టడం వల్లనే తన భర్త ఆరోగ్యాని కాపాడనని ఆమె గర్వంగా చెప్పుకొచ్చింది . దీనిపైన స్పందించిన న్యాయస్థానం ఇద్దరీకి కౌన్సిలింగ్ అవసరమని అధికారులకు సూచించింది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories