logo
జాతీయం

ఢిల్లీ చాందిని చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం..

A Huge fire Broke Out in Delhi Chandni Chowk
X

ఢిల్లీ చాందిని చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం.. 

Highlights

Delhi: భగీరథి ప్యాలెస్ ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో చెలరేగిన మంటలు

Delhi: ఢిల్లీలోని చాందిని చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భగీరథి ప్యాలెస్‌ ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో క్రమంగా అవి పక్కనున్న షాప్‌లకు వ్యాపించడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 40 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఎలాంటి హాని జరుగలేదని అధికారులు తెలిపారు. బిల్డింగ్‌లోని చాలా షాపులు దెబ్బతిన్నాయని, భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఫైర్‌ సర్వీస్‌ అధికారులు తెలిపారు.

Web TitleA Huge fire Broke Out in Delhi Chandni Chowk
Next Story