ఐస్‌ క్రీం దోస... ఐస్‌ క్రీంలో అద్దుకుని తినేయడమే!

ఐస్‌ క్రీం దోస... ఐస్‌ క్రీంలో అద్దుకుని తినేయడమే!
x
Highlights

నేను ట్రెండ్ ఫాలో అవను ట్రెండ్ సెట్ చేస్తానని గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా!.

నేను ట్రెండ్ ఫాలో అవను ట్రెండ్ సెట్ చేస్తానని గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా! ... అవును ఇప్పుడు ఈ డైలాగ్ బెంగళూరులోని ఓ టిఫిన్‌ సెంటర్‌ వారికి చక్కగా సరిపోతుంది మరి! అసలు దోశలను దోశ, ఇడ్లీ, వడలను చట్నీ, సాంబార్‌తోనే ఎందుకు తినాలి. పోనీ ఐస్‌ క్రీమ్‌తో తింటే ఎలా ఉంటుందని ఓ వినుత్నమైన ఆలోచన ఈ టిఫిన్‌ సెంటర్‌ యాజమాన్యానికి వచ్చింది. ఇప్పుడు ఇదే ఆలోచన అతని వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయాలుగా తిర్చిదిద్దుతుంది.

అక్కడ దోసె వేసేటప్పుడు దోసెకు పైనా, కిందా ఐసీ క్రీం పూత పూస్తారు. ఆ తర్వాత ప్లేట్‌లో ఐస్ క్రీం స్కూప్స్ ఇస్తారు. తీసుకుని దోసెను తుంచుకుని ఐస్ క్రీంలో అద్దుకుని తినాలి. టెస్ట్ వావ్ అని ఇక్కడ తిన్న వారు అభిప్రాయపడుతున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్ర వద్దకు చేరింది. ఈ వినుత్నమైన ఆలోచనకి అయన ఫిదా అయిపోయాడు. అయన ట్విట్టర్లో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. "భారతీయ వీధి విక్రేతలు ఆవిష్కరణకు వర్ణించలేని మూలం.నేను ఐస్‌ క్రీం దోసె కంటే వారి ఆలోచనకి ఫిదా అయ్యానని ఆనంద్‌ మహీంద్ర ట్వీట్ చేశారు .

ఇక్కడ ఐస్ క్రీం దోసకు మాత్రమే కాకుండా ఐస్ క్రీం ఇడ్లీలకు కూడా ప్రసిద్ది చెందింది. అయితే దీనిని కొందరు మెచ్చుకోగా, మరికొందరు మాత్రం సాంప్రదాయ వంటకాల యొక్క స్వచ్ఛతను కాపాడుకోవాలని, కంఫర్ట్ ఫుడ్స్ నాశనం చేయకూడదని అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories