అర్దరాత్రి జీపు నుండి జారిపడిన చిన్నారి .. పాపం రాత్రంతా అడివిలోనే!

అర్దరాత్రి జీపు నుండి జారిపడిన చిన్నారి .. పాపం రాత్రంతా అడివిలోనే!
x
Highlights

చిన్నారితో అడవి మార్గంలో జీపులో ప్రయాణిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. తల్లి ఒడిలో పాప ఉంది. రాత్రి సమయం. తల్లికి నిద్ర పట్టేసింది. ఇంతలో పాప ఆమె ఒడి నుంచి జారి కిందకు పడిపోయింది. నిద్రలో ఉన్న తల్లికి విషయం తెలియలేదు.. మెలకువ వచ్చి చూసుకునేసరికి పాప తన ఒడిలో లేదు.. ఏం జరిగిందో మీకోసం..

కేరళకి చెందిన ఓ ఇద్దరు దంపతులు తమ పాపతో కలిసి తమిళనాడులో ఓ వివాహ వేడుకకి హాజరయ్యారు . ఇక వివాహం నుండి తిరిగి ఇంటికి జీపులో ప్రయాణం అయ్యారు . అర్దరాత్రి కావడంతో అందరు నిద్రలోకి జారుకున్నారు . ఈ క్రమంలో ఇదుక్కి జిల్లాలోని దట్టమైన అడవి మార్గంలో జీపు వేగంతో మలుపు తీరగడంతో తల్లి చేతిలో ఉన్న పసిపాప జీపులో నుండి కింద పడిపోయింది . ఈ విషయాన్ని ఎవరు గుర్తించలేదు .

అ పసిపాప అర్దరాత్రి మొత్తం అ రోడ్డుపైన ఏడుస్తూ తన తల్లి కోసం వెతుకుతుంది . కాసేపటికి నిద్రనుండి తెరుకున్న అ చిన్నారి తల్లితండ్రులు పాప కోసం వెతకడం ప్రారభించారు . అయిన పాప ఆచూకి తెలియకపోవడంతో పోలీసులకి కంప్లేట్ చేసారు . ఈ క్రమంలో అదే అడవి మార్గంలో పొలిసు వాహనం రావడంతో అ పసిపాపను గుర్తించి చేరదీసారు . అన్ని పోలిస్ స్టేషన్ లో పాప గురించి ప్రకటన ఇవ్వడంతో పాప తల్లితండ్రులు వచ్చి పాపను తీసుకువెళ్ళారు . పాప కింద పడడం వల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలాయి . పాప కింద పడినది సీసీ పుటేజ్ లో రికార్డు అయింది .

నిజానికి అ అడవి మార్గంలో వన్య మృగాలు ,పాములు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి . కానీ వాటి బారిన పడకుండా పాప క్షేమంగా దొరకడంతో తల్లితండ్రుల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories