logo

హాట్స్ ఆఫ్ బామ్మా.... ఒక్క రూపాయికే ఇడ్లీ పెడుతుంది.

హాట్స్ ఆఫ్ బామ్మా.... ఒక్క రూపాయికే ఇడ్లీ పెడుతుంది.
Highlights

వ్యాపారంలో లాభాలూ.. లెక్కలూ ఆ బామ్మకు తెలీవు. తెలిసిందల్లా సాటి మనిషిలో ఉండే ఆకలి ఒక్కటే. ఆ ఆకలి తీర్చడమే తన బాధ్యతగా భావించింది. నామ మాత్రపు ధరకు.. ఆ బామ్మ ఇడ్లీలు ప్రజలకు అందిస్తూ తన బాధ్యతను నేరవేరుస్తోంది. అందరికీ ఆరాధ్యురాలిగా నిలుస్తోంది.

సహజంగా ఎవరైనా ఎందుకు వ్యాపారం చేస్తారు? లాభాలు సంపాదించడానికి. తమ జీవితంలో ఆర్థికంగా పైమెట్టు ఎక్కడానికి. కానీ, అక్కడక్కడా కాంతామణి ఉంటారు. లాభాపేక్ష లేకుండా.. తోటి వారికీ సహాయ పడాలనే కాంక్షతో జీవించేవారు. అటువంటి ఓ బామ్మ కథ ఇది. తమిళనాడులో ఓ బామ్మ రూపాయికే ఇడ్లీ పెడుతుంది. ఇప్పుడైతే మనకి కనీశం 20 రూపాయులు పెడితే కానీ, రెండు ఇడ్లీలు రావడం లేదు . అటువంటిది తమిళనాడులోని వడివేలంపాల్యం కె.కమలతాల్ అనే 80 ఏళ్ల బామ్మా గత 30 ఏళ్ల నుంచి ఇడ్లీలు అమ్ముతోంది. ఇదే ఆమె జీవనోపాధి కూడా ...

ఆ బామ్మ ఒక్కో ఇడ్లీకి గాను రూపాయి తీసుకుంటుంది . దీనికి ముందు 50 పైసలు మాత్రమే తీసుకునేది. కానీ ఇప్పుడు 50 పైసలు చలామణిలో లేదు కాబట్టి రూపాయికి పెంచాల్సిన అవసరం వచ్చింది. చాలా మంది ఆమెకి ఇడ్లీ రేటు పెంచు అని చెప్పారు. కానీ దీనిని ఆమె సున్నితంగా తిరస్కరించింది . అక్కడున్న పేదలు రూ.15 నుంచి రూ.20 చెల్లించడం కష్టమని, వారికోసమే ఇలా తక్కువ ధరకు ఇడ్లీ అమ్ముతున్నట్లు చెప్తుంది .చేసే పనిలో ఎలాంటి లాభాలు ఆశించకుండా పది మందికి తక్కువ ధరకే ఇడ్లీలు అమ్ముతుందంటే ఈ బామ్మాకి హాట్స్ ఆఫ్ అనకుండా ఎలా ఉంటాం చెప్పండి .


లైవ్ టీవి


Share it
Top