82 ఏళ్ల వయసులో, కదల్లేని స్థితిలో.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10,000 విరాళం

82 ఏళ్ల వయసులో, కదల్లేని స్థితిలో.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10,000 విరాళం
x
82 years old man donate 10000 rupes to cm relief fund in west Bengal
Highlights

కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ పోరాటాలకి సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ముందుకు వచ్చి తన గొప్ప మనసును చాటుకుంటున్నారు.

కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ పోరాటాలకి సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ముందుకు వచ్చి తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి సహాయనిధికి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధులకి భారీ మొత్తంలో విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఓ 82 ఏళ్ల వృద్దుడు తనకి తోచిన ఆర్ధిక సహాయాన్ని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నాడు..

సుభాష్ చంద్ర బెనర్జీ అనే 82 ఏళ్ల వృద్ధుడు పచ్చిమ్ బెంగాల్ లో టీచర్‌గా పని చేసి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం డమ్ డమ్ ఎయిర్‌పోర్టు వెనుక ఉన్న ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్నాడు. వచ్చే పెన్షన్ డబ్బులతో తనకి అవసరమైన మందులు, ఇంటి సామగ్రిని కొనుగోలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే కరోనా రక్కిసి పై తనవంతు భాద్యతగా విరాళం అందిచాలని అనుకున్నాడు. కానీ అది ప్రభుత్వానికి ఎలా అందజేయాలో తెలియక ఆందోళన చెందాడు.

ఈ క్రమంలో శనివారం అటుగా వచ్చిన పోలీసులను చూసి ఆయన చేయి ఊపారు. ఇది చూసిన పోలీసులు వృద్ధుడు ఏదైనా సాయం కావాలని కోరుతున్నాడో ఏమో అని పోలీసులు ఆయన ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లారు. లోపలికి వెళ్ళిన వారిని కూర్చోబెట్టిన అయన తనకు ఎలాంటి సహాయం అక్కరలేదని, రూ.10,000లను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్టు చెప్పి చెక్ రాసిచ్చి పోలీసులకి అందజేశారు.

ఒకరి సహాయం మీదా ఆధారపడాల్సిన ఈ 82 ఏళ్ల వృద్దుడు దేశంపై తనకున్న భాద్యతతో ముందుకు వచ్చి విరాళం ప్రకటించడం గొప్ప విషయం అని చెప్పవచ్చు.. ఇక ఈ వయసులో ప్రజల దగ్గరకెళ్లి సాయం చేయడం కష్టం కాబట్టి ఎలా సాయం చేయాలా అని ఆలోచించానని కానీ పోలీసులను చూడగానే వారికి చెక్ అందించాలన్న ఆలోచన వచ్చిందని సుభాష్ చంద్ర బెనర్జీ వెల్లడించాడు. ఇంకా చాలా మందుకు వచ్చి విరాళం ప్రకటించాలని కోరాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories