భారత వాయుసేనలోకి అపాచీ ఏహెచ్‌-64 హెలికాప్టర్లు

భారత వాయుసేనలోకి అపాచీ ఏహెచ్‌-64 హెలికాప్టర్లు
x
Highlights

అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు అపాచీ ఏహెచ్‌-64ఈ భారత వాయుసేనలో చేరింది. దీనికి సంబంధించిన అన్ని రకాల ముందస్తు పరీక్షలు ఇప్పటికే పూర్తి చేశామని వాయుసేన అధికారులు తెలిపారు.

అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు అపాచీ ఏహెచ్‌-64ఈ భారత వాయుసేనలో చేరింది. దీనికి సంబంధించిన అన్ని రకాల ముందస్తు పరీక్షలు ఇప్పటికే పూర్తి చేశామని వాయుసేన అధికారులు తెలిపారు. AFS హిండన్‌ వాయుస్థావరంలో తొలిసారి ఇవి గాలిలోకి విజయవంతంగా ఎగిరాయి. ఈ విషయాన్ని భారత వాయుసేన ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. అపాచీ యుద్ధ హెలికాప్టర్లలో ఏహెచ్‌-64 అత్యాధునికమైంది. వీటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. మొత్తం ఎనిమిది హెలికాప్టర్లు భారత వాయుసేన అమ్ములపొదిలో చేరాయి. పంజాబ్‌లోని పఠాన్ కోట్‌ వైమానిక స్థావరంలో వీటిని వాయుసేనకు అప్పగించారు. 22 ఏహెచ్‌-64కి హెలికాప్టర్లకు సంబంధించిన కొనుగోలు, శిక్షణకు సంబంధించి అమెరికాతో 2015లోనే ఒప్పందం కుదిరింది. 2020 నాటికి మొత్తం 22 హెలికాప్టర్లు భారత్‌కు చేరనున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories