పఠాన్ కోట్ కు చేరిన అపాచీలు..వాటర్ కేనన్లతో ఘనంగా స్వాగతం

పఠాన్ కోట్ కు చేరిన అపాచీలు..వాటర్ కేనన్లతో ఘనంగా స్వాగతం
x
Highlights

ఇండియన్ ఆర్మీలోకి మరో అత్యాధునిక ఆయుధ హెలీక్యాప్టర్ చేరింది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన సాంకేతికతతో కూడిన హెలీ క్యాప్టర్ ఇదే. ఇప్పటికే పరీక్షించిన ఈ...

ఇండియన్ ఆర్మీలోకి మరో అత్యాధునిక ఆయుధ హెలీక్యాప్టర్ చేరింది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన సాంకేతికతతో కూడిన హెలీ క్యాప్టర్ ఇదే. ఇప్పటికే పరీక్షించిన ఈ హెలీక్యాప్టర్లను భారత వాయుసేన రిసీవ్ చేసుకుంది.

అత్యాధునిక అపాచీ యుద్ధ హెలీక్యాప్టర్లు భారత వాయుసేనలో చేరాయి. ఈ ఏడాది జులైలో నాలుగు హెలీక్యాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ ఇండియాకి అప్పగించింది. కాగా ఈ రోజు మరో ఎనిమిది హెలీక్యాప్టర్లు ఇండియన్ ఆర్మీకి అందాయి. వీటిని పఠాన్ కోట్ భారత వైమానిక స్థావరానికి అందించారు. ఈ సందర్భంగా పఠాన్ కోట్ లో ఇండియన్ ఆర్మీ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. తొలుత ఐఎఎఫ్ చీఫ‌ బిఎన్ ధనోవా ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఆతర్వాత వాటర్ కేనన్ సెల్యూట్ తో వాయుసేన సైనికులు అపాచీకి ఘనంగా స్వాగతం చెప్పారు. ధనోవాకు బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తా సెరిమోనియల్ కి అప్పగించారు

భారత రక్షణ మంత్రిత్వశాఖ, అదనంగా అత్యాధునిక ఆయుధాలతో కూడిన మరో ఆరు అపాచీ హెలీక్యాప్టర్ల కొనుగోలుకు 4,168 కోట్ల రూపాయలను ఇండియన్ ఆర్మీ బోయింగ్, సంస్థకు చెల్లించింది. బోయింగ్ సంస్థ ఇప్పటి వరకు 2,200 అపాచీ హెలీక్యాప్టర్లను ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు దేశాలకు అందించింది. ఈ తరహా చాపర్లను ఉపయోగిస్తున్న దేశాల్లో భారత్ 14వది కావడం విశేషం.

22 అపాచీ హెలీక్యాప్టర్లను కొనుగోలుచేయడానికి వీలుగా అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థతో 2015 సెప్టెంబర్ లో ఒప్పందం కుదిరింది. 2020 నాటికి నిర్ణీత హెలీక్యాప్టర్లు మొత్తం ఇండియాకు చేరతాయి. ఈ హెలీక్యాప్టర్ల పనితీరుని ఎఎఫ్ఎస్ హిండన్ వాయు స్థావరంలో పరీక్షించినట్లు వాయుసేన తెలిపింది. ఆ విజువల్స్ ని కూడా ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఎరో స్పేస్ మేజర్ మాట్లాడుతూ, ఎహెచ్-64ఇ అత్యాధునిక సాంకేతిక పరిజ్నానంతో చేసిందని, ఇందులో ప్రపంచంలోనే నెంబర్ వన్ యుద్ధ హెలీక్యాప్టర్ గా పేరుందన్నారు.

ఇదిలావుండగా ఈ నెల 19వ తేదీన భారత వాయుసేన అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక యుద్ధ విమానం చేరనుంది. తొలి రఫేల్ యుద్ధ విమానం ఫ్రాన్స్ నుంచి రానుంది. ఫ్రాన్సలో నిర్వహించే మోర్కానిక్ కార్యక్రమానికి భారత రక్షణ మంత్రి, ఐఎఎఫ్ చీఫ‌ బిఎన్ ధనోవాలు హాజరయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏప్రిల్, మేలో మరో నాలుగు విమానాలు అందుతాయి. 2022లోగా మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలు దిగుమతి అవుతాయి. 2016 సెప్టెంబర్ 23న, 59వేల కోట్ల విలువైన 36 యుద్ధ విమానాల దిగుమతికి భాతర ప్రభుత్వం ఫ్రాన్స్ లోని రాఫెల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అప్పట్లో ఇండియాలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.

మొత్తానికి భారత రక్షణ వ్యవస్థ రోజురోజుకు బలపడుతున్నది. అత్యాధునిక వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అపాచీ, రాఫెల్ యుద్ధ విమానాలతో వాయుసేన మరింతగా బలం పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories