భారత్‌లో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర ..!

భారత్‌లో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర ..!
x
Highlights

భారత్‌లో విధ్వంసమే లక్ష్యంగా పాకిస్ధాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులు భారీ కుట్రకు పాల్పడుతున్నట్టు ఐబీ హెచ్చరించింది. ఈశాన్య,పాక్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఎక్కువగా ఉండటంతో శ్రీలంక మీదుగా సముద్ర మార్గం ద్వారా ఆరుగురు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.

భారత్‌లో విధ్వంసమే లక్ష్యంగా పాకిస్ధాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులు భారీ కుట్రకు పాల్పడుతున్నట్టు ఐబీ హెచ్చరించింది. ఈశాన్య,పాక్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఎక్కువగా ఉండటంతో శ్రీలంక మీదుగా సముద్ర మార్గం ద్వారా ఆరుగురు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు భావిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్‌లో విధ్వంసం స్పష్టించేందుకు పాక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇందులో భాగంగానే సరిహద్దు రాష్ట్రాలతో పాటు సున్నితమైన ప్రదేశాల్లో భద్రత పెంచాలంటూ ఆదేశించాయి.

ఐబీ హెచ్చరికలతో తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదుల ప్రభావం ఉండే కొయంబత్తూరుతో పాటు సున్నితమైన ఇతర ప్రదేశాల్లో నిఘాను ముమ్మరం చేసింది. దేశంలోకి ప్రవేశించిన వారిలో ఓ పాకిస్ధాన్ జాతీయుడితో ఆప్ఘనిస్తాన్‌కు చెందిన పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు ఉన్నట్టు భావిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జనసమర్ధ ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ సర్వీసులతో పాటు ఇతర నిఘా వ్యవస్ధలను అప్రమత్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories