Coronavirus: ఢిల్లీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..

Coronavirus: ఢిల్లీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..
x
Highlights

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి...

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 534 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,088కి పెరిగింది. ఇందులో 5720 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 176 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.

భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,06,750కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 3,303 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 42,298 మంది కోలుకోగా మరో 61,149 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories