అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
x
Highlights

దశాబ్దాలుగా పెండింగులో ఉన్న అయోధ్య కేసులో భారతీయ సర్వోన్నత న్యాయస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రామ జన్మభూమి, బాబ్రీ మస్జిద్ వివాదం అంశంపై వాదనలు...

దశాబ్దాలుగా పెండింగులో ఉన్న అయోధ్య కేసులో భారతీయ సర్వోన్నత న్యాయస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రామ జన్మభూమి, బాబ్రీ మస్జిద్ వివాదం అంశంపై వాదనలు వినేందుకు సుప్రీం కోర్టు.. ఐదుగురు జడ్జీలు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఏర్పడిన ఈ ధర్మాసనం ఇరువురి వాదనలు వినాల్సి ఉంటుంది. కాగా అలహాబాద్ హైకోర్టు 2010లోఇచ్చిన తీర్పుపై అప్పిల్ కోరుతూ సుప్రీంలో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

వివాద అంశంగా ఉన్న మొత్తం 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అకారా, రామ్ లల్లాలకు సమ భాగాలుగా పంచాలని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదిలావుంటే విచారణ త్వరగా చేపట్టాలని ఆర్‌ఎస్‌ఎస్ సహా పలు హిందూత్వ సంస్థలు కోరుతున్నాయి. అలాగే దీనిపై గతంలోనే పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లను సైతం దాఖలు చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories