ఒక్క విందు.. 26 వేల మంది క్వారంటైన్..

ఒక్క విందు.. 26 వేల మంది క్వారంటైన్..
x
Highlights

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది. మురేనా నగరంలో ఓ వ్యక్తి ఇచ్చిన విందుతో ఏకంగా 26 వేల...

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది. మురేనా నగరంలో ఓ వ్యక్తి ఇచ్చిన విందుతో ఏకంగా 26 వేల మంది క్వారంటైన్ లోకి వెళ్లటం అందరినీ షాక్ కి గురిచేస్తోంది.

దుబాయ్ లో వెయిటర్ గా పనిచేస్తోన్న మురేనా నగరానికి చెందిన ఓ వ్యక్తి తన తల్లి చనిపోవటంతో మార్చి 17న సొంతూరికి చేరుకున్నాడు.సంప్రదాయం ప్రకారం తల్లి చనిపోయిన మూడోరోజు విందు ఏర్పాటు చేశాడు. ఈ విందులో దాదాపు 12 వందల మంది పాల్గొన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. మార్చి 27న అసలు కథ మొదలైంది. ఆ వ్యక్తితో పాటు అతని భార్య కరోనా లక్షణాలతో హాస్పిటల్ లో చేరారు. వారిద్దరి రిపోర్ట్ ఈనెల 2న రాగా.. కరోనా పాజిటివ్ గా తేలింది.

ఆ తర్వాత విందులో పాల్గొన్న మరో పది మందికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విందుకు హాజరైన వారితో పాటు వారి కుటుంబసభ్యులు, వారితో సన్నిహితంగా మెలిగిన దాదాపు 26 వేల మందిని క్వారంటైన్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories