Guinness Record : 1995 కేజీల కిచిడీ

Guinness Record : 1995 కేజీల కిచిడీ
x
Highlights

సాధారణంగా ఫంక్షన్లలోనో, పార్టీలలోనో వంటలు చేసేవారు 100 కిలోలు, 200 కిలోలో వండుతారు. కానీ హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాకు 55 కిలోమీటర్ల దూరంలోని...

సాధారణంగా ఫంక్షన్లలోనో, పార్టీలలోనో వంటలు చేసేవారు 100 కిలోలు, 200 కిలోలో వండుతారు. కానీ హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాకు 55 కిలోమీటర్ల దూరంలోని తట్టపాణి గ్రామంలో ఏకంగా 1995 కిలోల కిచిడీని వండారు. దేశంలోనే ఇప్పటివరకూ ఇంత భారీ స్ధాయిలో ఒకే వంటకాన్ని ఒకేసారి ఎవరూ వండక పోవడంతో ఆ కిచిడీ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఈ కిచిడీని మకర సంక్రాంతి సందర్భంగా సట్లెజ్‌ నదీ తీరం వద్దకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు కోసం వండారు. ప్రతి ఏడాది సంక్రాంతికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇదే కోణంలోనే 1995 కేజీల కిచిడీని ఒకే పాత్రలో వండి గిన్నిస్‌ రికార్డ్స్‌లోకి ఎక్కారు నిర్వాహకులు.

ఈ కిచిడీని తయారు చేయడానికి 25 మంది చెఫ్‌లు ఐదు గంటలు శ్రమించారు. దీని తయారీ కోసం 450 కిలోల బియ్యం, 190 కిలోల ధాన్యాలు, 90 కిలోల నెయ్యి, 55 కిలోల సుగంధ ద్రవ్యాలు, 1,100 లీటర్ల నీటిని వినియోగించారు. దీంతో గతేడాది ప్రముఖ చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌ తయారు చేసిన 918.8 కేజీల కిచిడీ రికార్డ్‌ బద్దలైంది. ఇక వచ్చే ఏడాది ఎన్ని కిలోల కిచిడీ వండి భక్తులకు అన్నదానం చేస్తారో వచ్చే ఏడాది వరకూ వేచి చూడాల్సిందే.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories