వర్షాలకు ముంబై అతలాకుతలం : 16 మంది దుర్మరణం

వర్షాలకు ముంబై అతలాకుతలం : 16 మంది దుర్మరణం
x
Highlights

ముంబైలో భారీ వర్షాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. గోడ కూలిన రెండు వేర్వేరు సంఘటనల్లో 16 మంది మృత్యువాత పడ్డారు. ముంబైలోని మలాద్ ఈస్ట్ ప్రాంతంలో...

ముంబైలో భారీ వర్షాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. గోడ కూలిన రెండు వేర్వేరు సంఘటనల్లో 16 మంది మృత్యువాత పడ్డారు. ముంబైలోని మలాద్ ఈస్ట్ ప్రాంతంలో కాంపౌండ్ వాల్‌ కూలిన ఘనటలో 13 మంది ప్రాణాలు కోల్పోగా..నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌ రంగంలో దిగింది. డాగ్‌ స్వ్కాడ్‌ను కూడా రంగంలో దించారు. వీటితో పాటు అగ్నిమాపక దళాలు కూడా సహాయకచర్యల్లో పాల్గొంటున్నాయి. జోగేశ్వరి ప్రాంతంలో ఉన్న శతాబ్ధి ఆసుపత్రిలో 13 మంది క్షతగాత్రులను చేర్చారు. వైద్యం అందిస్తున్నారు. ముంబైలోనే కళ్యాణీ ప్రాంతంలో జరిగిన మరో గోడ కూలిన సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఓ స్కూల్‌కి చెందిన బిల్డింగ్‌ గోడ కూలడంతో మూడేళ్ల బాలుడితో సహా మరో ఇద్దరు చనిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories