పంట వ్యర్థాలను కాల్చిన 16 మంది రైతుల అరెస్ట్

ప్రతీకాత్మక చిత్రం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ఇటీవల ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాణాలు తగ్గతపోవడం, కాలుష్యం పెరగడంతో దాని నివారణకు సుప్రీం కోర్టు కొన్ని నిబంధనలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే....

ఇటీవల ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాణాలు తగ్గతపోవడం, కాలుష్యం పెరగడంతో దాని నివారణకు సుప్రీం కోర్టు కొన్ని నిబంధనలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది రైతులు తమ పంట వ్యర్ధాలను కాల్చివేసారు. దీంతో అక్కడున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంఘటన యూపీలో చోటు చేసుకుంది. పొలాల్లో ఉన్న పంట వ్యర్ధాలను మధురకు చెందిన 16 మంది రైతులు కాల్చేశారు. దీంతో గాలిలో కాలుష్యం అధికంగా అవుతుందని ఆ 16మంది రైతులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ విధంగా పంట వ్యర్థాలను కాల్చిన కేసులు 300 నమోద చేశామని, రూ.13.05 లక్షల వరకు జరిమానా విధించామని తెలిపారు. విధులలో నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు పంచాయతీ అధికారులను సస్పెండ్ చేసినట్టు మధుర జిల్లా మేజిస్ట్రేట్ సర్వజ్ఞ రాం మిశ్రా స్ఫష్టం చేశారు. ఇంకెవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories