'జ్యోతి' దైర్యసాహసాలకి సీఎఫ్ఐ ఫిదా.. ట్రయల్స్ కి రావాలని ఆహ్వానం!

జ్యోతి దైర్యసాహసాలకి సీఎఫ్ఐ ఫిదా.. ట్రయల్స్ కి రావాలని ఆహ్వానం!
x
Highlights

ఎక్కడి కరోనా ఏమో కానీ చాలా మందిని పోట్టిన పెట్టుకుంది. మరోకొంతమంది పొట్ట కొడుతుంది.

ఎక్కడి కరోనా ఏమో కానీ చాలా మందిని పోట్టిన పెట్టుకుంది. మరోకొంతమంది పొట్ట కొడుతుంది. కరోనా వ్యాప్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన వలస కూలీల బతుకులు రోడ్డు మీదా పడ్డాయి. తినడానికి తిండిలేకా, దాచుకున్న పైసలు కూడా అయిపోవడంతో తిరిగి సొంత ఊరికి కాలినడకన పయనం అవుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకు చాలానే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తున్నాయి.

అందులో భాగంగానే బీహార్‌లోని దర్భంగాకు చెందిన ఒక వ్యక్తి ఉపాధి కోసం ఢిల్లీకి వెళ్ళాడు.. అక్కడ అద్దెకి రిక్షా తొక్కుతూ తన కూతురు జ్యోతి కుమారితో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోవడం ఒక సమస్యగా మారితే పాపం అతనికి గాయాలు అవడం మరో ఇబ్బందిగా మారింది, దీనికి తోడు అద్దెకి ఇంటి యజమాని కూడా ఇబ్బంది పెట్టడంతో చేసేది ఏమీ లేకా రూ. 500 పెట్టి సైకిల్ కొనుక్కొని కూతురుతో కలిసి సొంత ఊరుకి పయనం అయ్యాడు.

తండ్రి గాయాలుపాలు కావడంతో తన తండ్రిని వెనుక ఎక్కించుకొని జ్యోతి కుమారి 1200 కి.మీ సైకిల్ తొక్కింది. అలా వారం రోజుల తరవాత ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్నా అధికారులు వారికీ కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిద్దరికీ నెగిటివ్ రావడం విశేషం.. రాత్రి సమయాలలో ఓ అడిపిల్ల అంత దైర్యం చేసి, అన్ని కి.మీ సైకిల్ తొక్కడం పట్ల ఆమెను పలువురు అభినందిస్తున్నారు. ఆమె దైర్యసహసాలకి ఫిదా అయిపోతున్నారు.

అందులో భాగంగానే భారత సైక్లింగ్ సమాఖ్య (సీఎఫ్ఐ - సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా), ఆమెకు బంపరాఫర్ ఇచ్చింది. ఆమెతో ప్రత్యేకంగా ముచ్చటించిన భారత సైక్లింగ్ సమాఖ్య చైర్మన్ ఓంకార్ సింగ్ ట్రయల్స్ కోసం ఢిల్లీకి రావాలని, ట్రయల్స్ లో సత్తా చాటితే, జాతీయ సైక్లింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories