మా డాడీ నన్ను చదువుకోనివ్వడం లేదు.. పోలీసుకి ఫిర్యాదు చేసిన బాలుడు..

మా డాడీ నన్ను చదువుకోనివ్వడం లేదు.. పోలీసుకి ఫిర్యాదు చేసిన బాలుడు..
x
Highlights

"చదువు" పేదరికాన్ని ఎదిరించాలన్న, సమాజంలో గౌరవం పొందలన్న.. కుల, మత బేధాలకు చెక్ పెట్టాలంటే చదువు ఒక్కటే మార్గం అని,చదువుకోవడం పిల్లల హక్కు. పేదరికం...

"చదువు" పేదరికాన్ని ఎదిరించాలన్న, సమాజంలో గౌరవం పొందలన్న.. కుల, మత బేధాలకు చెక్ పెట్టాలంటే చదువు ఒక్కటే మార్గం అని,చదువుకోవడం పిల్లల హక్కు. పేదరికం నుంచి బయటపడేసే ఆయుధం చదువే అని ఎందరో మహనీయులు చెప్పారు. అలాంటి కోరికతోనే ఓ పేద విద్యార్థి చదువుపై శ్రద్దతోటి చదువుకుందాం అంటే తన తండ్రే తనను సరిగా చదువుకోనివ్వడమే లేదని ఓ బాలుడు ఏకంగా పోలీసులనే ఆశ్రయించాడు. రాత్రింతా టీవీ చూస్తాడు.. తన తల్లికి ఇష్టమోచ్చినట్లు కొడుతడని మహారాష్ట్ర.. జలగామ్‌ జిల్లా జమనేర్‌కు చెందిన అజయ్‌ (12) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్టేషన్‌కు చిన్న నిక్కర్, బనియన్ వేసుకొని వచ్చాడు. ఆ పిల్లడ్ని చూసి పోలీసులు నివ్వెరపోయారు. పోలీసు స్టేషన్ లో ఎంటర్ అవుతునే ఆ బుడతడు తన ఇబ్బందులను ఇన్‌స్పెక్టర్‌ కు వివరించాడు.

తన తండ్రి బాగోతం మొత్తం ఇన్‌స్పెక్టర్‌కి వివరిస్తూ రోజు తాను చదువుకోలేకపోతున్నానని వివరించాడు. తన తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు కాగా తల్లి వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. తన ఇద్దరు తోబుట్టువులతో కలిసి ఆ బాలుడు స్థానికంగా ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడు. అయితే ఆ బాలుడికి చదువు పట్ల ఉన్న శ్రద్ధను గ్రహించిన పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌ అతని తల్లిదండ్రులను పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్‌ ఇచ్చారు. పిల్లాడి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని తలిదండ్రులను హెచ్చరించాడు. అనంతరం బాలుడిని తన జీపులో తీసుకొని మార్కెట్‌ వెళ్లి అతడికి దుస్తులు, చెప్పులు కూడా కొనిచ్చారు. ఈ బాలుడికి చదువుపై ఉన్న శ్రద్ద మరియు ధైర్యాన్ని చూసి పోలీసులు ఫిదా అయ్యారు. మొత్తనికి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories