సౌదీ లో క‌రోనాతో 11 మంది భారతీయులు మృతి

సౌదీ లో క‌రోనాతో 11 మంది భారతీయులు మృతి
x
Highlights

కంటికి కనిపించని క‌రోనా వైరస్ సృష్టిస్తోన్న బీభత్సంతో దేశాలకు దేశాలు వణికిపోతున్నాయి. వైరస్ కు భయపడి నిర్బంధంలో తలదాచుకుంటున్నాయి. ప్రచండ వేగంతో...

కంటికి కనిపించని క‌రోనా వైరస్ సృష్టిస్తోన్న బీభత్సంతో దేశాలకు దేశాలు వణికిపోతున్నాయి. వైరస్ కు భయపడి నిర్బంధంలో తలదాచుకుంటున్నాయి. ప్రచండ వేగంతో ప్రపంచాన్ని కమ్మేస్తుంది కరోనా మహమ్మారి. ఇప్పటికే ఈ రాకసి వైరస్ రెండు వందల దేశాలను చుట్టుముట్టింది. ఈ వైరస్ బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారికి ప్రపంచం అంతా అతలాకుతలం అవుతోంది.

తాజాగా సౌదీ అరేబి‌యాలో 11 మంది భార‌తీయులు క‌రోనా బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. మదీనాలో నలుగురు, మక్కాలో ముగ్గురు, జెడ్డాలో ఇద్దరు, రియాద్‌, దమ్మాంలో ఒక్కొక్కరు మరణించినట్లు సౌదీలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అయితే అక్కడ ఉన్న భారత పౌరుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. సౌదీలో ఇప్పటి వరకు 13,930 మంది కరోనా బారిన పడగా, మొత్తం 121 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో సౌదీలో ఉన్న ప్రవాస భారతీయులంతా సామాజిక దూరాన్ని పాటించాలని అధికారులు కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories