Top
logo

బీహార్‌ ముజఫర్‌పూర్‌లో మృత్యుకేళి.. 103కు చేరిన చిన్నారుల మరణాలు

బీహార్‌ ముజఫర్‌పూర్‌లో మృత్యుకేళి.. 103కు చేరిన చిన్నారుల మరణాలు
Highlights

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మృత్యుకేళి ఆగడం లేదు. మెదడువాపు వ్యాధి పసి ప్రాణాలను కబలిస్తోంది. ప్రభుత్వం...

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మృత్యుకేళి ఆగడం లేదు. మెదడువాపు వ్యాధి పసి ప్రాణాలను కబలిస్తోంది. ప్రభుత్వం ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మరణమృదంగం మోగిస్తోంది.మెదడువాపు వ్యాధి లక్షణాలతో మృతిచెందుతున్న చిన్నారుల సంఖ్య103కు పెరిగింది. శ్రీకృష్ణ మెడికల్ కాలేజీలో 83 మంది, కేజ్రీవాల్ దవాఖానలో 17 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. మరో 300 మందికి పైగా ఈ రెండు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.

మెదడువాపు లక్షణాలతో మృతి చెందిన చిన్నారుల సంఖ్య పెరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వ్యాధి గురించి అవగాహన లేకపోవడంతో ఎలాంటి చికిత్స అందించాలో తెలియడం లేదని దీంతో మృతుల సంఖ్య పెరుగుతున్నదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సైతం ఒప్పుకున్నారు. పిల్లల మరణాలపై క్షేత్రస్థాయిలో పరిశోధన జరిపేందుకు మరో అత్యున్నత స్థాయి బృందాన్ని ముజఫర్‌పూర్‌కు పంపించాలని ఆదేశించారు.

Next Story

లైవ్ టీవి


Share it