Top
logo

బకాయిలు చెల్లించలేక 1000 బిఎస్ఎన్ఎల్ టవర్ల మూసివేత

బకాయిలు చెల్లించలేక 1000 బిఎస్ఎన్ఎల్ టవర్ల మూసివేత
X
Highlights

ముంబై : ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్‌ సంచార నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌)ను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి....


ముంబై : ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్‌ సంచార నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌)ను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. బకాయిలు చెల్లించలేక దేశవ్యాప్తంగా 1000 టవర్లను మూసేసింది.

తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళ సర్కిళ్లలోని టవర్లను ఆపేసినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.

ముఖ్యంగా విద్యుత్‌ చార్జిలు, ఐటీ సేవల బిల్లులు, టెలికాం మౌలిక వసతి సంస్థల బిల్లుల బకాయిలు పెరిగిపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

తమకు రూ. 1.5కోట్ల బకాయిలు చెల్లించనందుకు తమిళనాడులోని కోటగిరిలో బీఎ్‌సఎన్‌ఎల్‌ టవర్‌ను ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఇటీవల స్వాధీనపరచుకోవడం గమనార్హం.

Next Story