logo

బీజేపిలోకి పది మంది ఎమ్మెల్యేలు జంప్

బీజేపిలోకి పది మంది ఎమ్మెల్యేలు జంప్
Highlights

దేశం మొత్తం కాషాయపు రంగుతో నింపివేయాలని కమలనాధులు పక్కా ప్లాన్ తో ఉన్నట్టు కనిపిస్తుంది . కర్ణాటకలో ఇప్పటికే...

దేశం మొత్తం కాషాయపు రంగుతో నింపివేయాలని కమలనాధులు పక్కా ప్లాన్ తో ఉన్నట్టు కనిపిస్తుంది . కర్ణాటకలో ఇప్పటికే పాగా వేసిన బీజేపీ ఇక ఈశాన్య రాష్త్రం అయిన సిక్కం పైన ఫోకస్ పెట్టింది. నిన్నటివరకు అక్కడ ఒక్క సీటు కూడా గెలుచుకొని బీజేపి ఇప్పుడు ఏకంగా పది మందితో రెండో అతిపెద్ద పార్టీగా అవతరిచింది . ఆకడున్న సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీ నుంచి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఒకేసారి భాజపాలో చేరారు. దీనితో బీజేపీ అక్కడ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది...సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో అప్పటివరకు అధికారంలోకి ఉన్న సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కాదని ప్రజలు సిక్కిం క్రాంతికారి మోర్చాకి అధికారాన్ని కట్టబెట్టారు . 25ఏళ్లకు పైగా సిక్కిం సీఎంగా పవన్ చామ్లింగ్‌ దేశంలోనే అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు.






లైవ్ టీవి


Share it
Top