పాపం ఆ తండ్రీ కొడుకులు : స్మశానమే వారి ఇల్లు

పాపం ఆ తండ్రీ కొడుకులు : స్మశానమే వారి ఇల్లు
x
Highlights

కొంతమందికి ఎంత సంపాదించినా ఇంకా కావాలి అనుకుంటారు. కొంతమంది ఉన్న దాంట్లో సరిపెట్టుకుందాం అనుకుంటారు. మరి కొంత మంది మాత్రం ఈ రోజు గడిస్తే చాలు అనుకుంటారు.

కొంతమందికి ఎంత సంపాదించినా ఇంకా కావాలి అనుకుంటారు. కొంతమంది ఉన్న దాంట్లో సరిపెట్టుకుందాం అనుకుంటారు. మరి కొంత మంది మాత్రం ఈ రోజు గడిస్తే చాలు అనుకుంటారు. .కాని ఇక్కడ మాత్రం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేకుండా తిండి దొరికిన రోజు తింటూ లేని రోజు పస్తులుంటున్నారు. నిలువ నీడ లేక స్మశానాన్నే వారి ఇల్లు చేసుకున్నారు. అందరి హృదయాలను కలచివేసే సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో కుడారీ గ్రామానికి చెందిన రామ్‌రతన్ కు సంబంధించిన దీన గాధ ఇది. రామ్‌రతన్ భార్య ఏడేళ్ల క్రితమే ప్రసవం సమయంలో మృతి చెందింది. దాంతో రాంరతన్ అతని కొడుకును చూసుకుంటూ కూలి చేసుకుంటూ బతుకుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రామ్‌రతన్ ఇల్లు కుప్పకూలింది. దీంతో అతను దిక్కు తోచని పరిస్థితిలో తన 9 ఏళ్ల కొడుకుతో పాటు శ్మశానానికి తన మకాం మార్చాడు. రాత్రులు ఆ తండ్రీకొడుకులు ఇద్దరూ శ్మశానంలోనే ఉంటున్నారు. పగలు ఏ పని దొరకనపుడు అక్కడే ఉంటున్నారు. వీళ్ళకి ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం, పథకాల లబ్ధి దొరకలేదు. కనీసం ఆ గ్రామ పంచాయతీ కూడా వీళ్ళని ఆడుకోకుండా వొదిలేసింది. దీంతో ఆ తండ్రీకొడుకులిద్దరూ ఆకలికి అలమటిస్తూ ఖాళీ కడుపుతోనే పడుకుంటున్నారు.

ఎప్పుడైనా, ఎవరైనా ఆ చుట్టుపక్కన వచ్చే, పోయేవారు వీరి దీనస్థితిని చూసి ఆహారం అందిస్తున్నారు. రామ్‌రతన్ భార్య చనిపోయినప్పుడు కూడా వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థికసాయం అందలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు తన ఇల్లు కూలిపోయిన విషయాన్ని రామ్‌రతన్ గ్రామ సర్పంచ్‌కు తెలిపినా ఫలితం లేకపోయింది. నిలువ నీడ లేకుండా, ఆర్ధిక పరిస్థితి సరిగా లేని కారణంగా రామ్‌రతన్ కొడుకు పాఠశాలకు కూడా వెళ్లలేని పరిస్థితి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories