చెత్తను కాలిస్తే లక్ష జరిమానా : సుప్రీం కోర్ట్

burning garbage
x
burning garbage
Highlights

పట్టణాల్లో వాతావరణ కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉన్నందున సుప్రీం కోర్ట్ సంచలనాత్మక తీర్పును ఈరోజు వెలువరించింది.

ఢిల్లీలో వాతావరణ కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. అదేవిధంగా పట్టణాల్లోను వాతావరణ కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉన్నందున సుప్రీం కోర్ట్ సంచలనాత్మక తీర్పును ఈరోజు వెలువరించింది. ఢిల్లీ కాలుష్యంపై కేసును న‌వంబ‌ర్ 6వ తేదీన మ‌రోసారి విచారించ‌నున్న నేపద్యంలో కొన్ని నిబంధనలు విధించింది.

వీధుల్లో ఎవరైనా చెత్తను కాల్చినా, రాజధాని ప్రాంతంలో భవనాల నిర్మాణ పనులను జరిపినా అంతే కాక చెత్తను వీధుల్లో, నివాసాలకి దగ్గరలో డంప్ చేసినా వారికి అధిక మొత్తంలో జరిమానా విధించాలని తెలిపారు. జరిమానా వివరాల్లోకెళితే చెత్తను కాలిస్తే రూ.1లక్ష, చెత్తను డంప్ చేసిన వారికి రూ.5వేలు జరిమానా విధించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల‌ను ఢిల్లీ, పంజాబ్‌, హ‌ర్యానా, యూపీ రాష్ట్రాలు పాటించాల‌ని తెలిపారు. కోర్ట్ తెలిపిన నిబంధనలు ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories