కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం

కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం
x
Highlights

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యే రామలింగారెడ్డితో సీఎం కుమారస్వామి రహస్య ప్రదేశంలో భేటీ నిర్వహించారు. తాజా రాజకీయ...

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యే రామలింగారెడ్డితో సీఎం కుమారస్వామి రహస్య ప్రదేశంలో భేటీ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఏళ్ల తరబడి కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకుని సేవ చేస్తున్న రామలింగారెడ్డి సరైన గుర్తింపు లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేసి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు ఈ భేటీ జరిగింది. రామలింగారెడ్డితో పాటు రాజీనామా చేసిన ఇతర ఎమ్మెల్యేలను సంప్రదించే ప్రక్రియ కొనసాగుతుంది.

రాజీనామా చేసిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్‌ రమేశ్‌ ఈ రోజు ఓ నిర్ణయానికి రానున్నారు. అయితే, రాజీనామాల ఉపసంహరణ ప్రసక్తే లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. సీఎంను మార్చినా తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సంకీర్ణ ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు షాకులమీద షాకిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన మంత్రులందరూ రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారని ఆ పార్టీ ఎంపీ డీకే సురేశ్‌ స్పష్టం చేశారు. రాజకీయ సంక్షోభం వెనుక బీజేపీ జాతీయ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ కాకుండా వేరే పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తుంటారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేస్తోందని సురేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories