'యాత్ర' యూనిట్‌కు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

యాత్ర యూనిట్‌కు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు
x
Highlights

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్య ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ సినిమా...

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్య ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర దేశాల్లో ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఇక సినిమాకు వస్తున్న రెస్పాన్స్, ఊహించని హిట్ తో వైసీపీ కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక యాత్ర విజయం సాధించడం పట్ల వైయస్ కుమారుడు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 'మహానేత రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని సినిమాగా తెరకెక్కించటంలో మీరు చూపించిన అభిరుచి, అకింతభావానికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు' అంటూ చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులను అభినందించారు జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories