'యాత్ర' సినిమాకు మొదటి రోజు భారీగానే..

యాత్ర సినిమాకు మొదటి రోజు భారీగానే..
x
Highlights

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర నేపథ్యంతో తెరకెక్కిన సినిమా యాత్ర.. మలయాళ మెగాస్టార్‌ మమ్మూటి వైఎస్సార్‌ పాత్రలో...

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర నేపథ్యంతో తెరకెక్కిన సినిమా యాత్ర.. మలయాళ మెగాస్టార్‌ మమ్మూటి వైఎస్సార్‌ పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రజల హృదయాలను హత్తుకునేలా ఈ సినిమా ఉందని ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైయస్ఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో అభిమానులు థియేటర్ల వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు.

ఇక కేవలం తెలుగురాష్ట్రాల్లోనే కాక అమెరికాలో సైతం ఈ సినిమాను పెద్దఎత్తున ఆదరిస్తున్నారు. సినిమా ఘనవిజయం సాధించడంతో డల్లాస్ లోని వైయస్ఆర్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇక ఈ మూవీకి మొదటి రోజు భారీగానే కలెక్షన్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వైయస్ఆర్ ప్రజలకు దూరమై పదేళ్లు గడుస్తున్నా.. నేటికీ అభిమానం తగ్గకపోవడం ఒక గొప్ప విషయంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories