14 రోజుల 'యాత్ర' కలెక్షన్లు చూస్తే..

14 రోజుల యాత్ర కలెక్షన్లు చూస్తే..
x
Highlights

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర' ఈనెల విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది....

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర' ఈనెల విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ బయోపిక్ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. తొలివారం డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడికి 50% శాతానికి పైగా రికవరీ అవగా.. 14 రోజుల్లో ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి 28 కోట్ల గ్రాస్ సాధించినట్టు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ చిత్రం 2019లో విడుదలైన చిత్రాల్లో 'ఎఫ్ 2' తర్వాత అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది.

ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' విడుదలైన తర్వాత 'యాత్ర' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఎన్టీఆర్-కథానాయకుడు' అట్టర్ ప్లాప్ అవ్వడంతో 'యాత్ర'పై చాలా మందిలో సందేహాలు మొదలయ్యాయి.. కానీ అంచనాలను మించి యాత్ర హిట్ అవవడం విశేషం. ఇక యాత్ర' మూవీ థియేట్రికల్ రైట్స్ రూ. 13.40 కోట్లకు అమ్మారు. 14 రోజుల్లోఈ చిత్రానికి రూ.15 కోట్లుషేర్ వసూలు కావడంతో నిర్మాతలకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు అరకొర లాభాలు వచ్చాయి. కాగా ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అనే చెప్పుకోవాలి. ఆయన సహజ నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories