logo

'యాత్ర' టికెట్స్ ఆల్మోస్ట్ ఫుల్..

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను బేస్ చేసుకుని తీసిన సినిమా 'యాత్ర' ఈ చిత్రం నైజాం, వైజాగ్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. ఈ సందర్బంగా దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ అందరికి తెలుసు. టీవీ ఛానల్ లు, సోషల్ మీడియా లేని టైంలో వైయస్ చేసిన పాదయాత్ర ప్రతిఒక్కరి హృదయాల్లో నిలిచిపోయిందని అన్నారు. తెలుగు ప్రజల దృష్టిలో వైయస్ఆర్ ఒక హీరో అని అన్నారు. తెలుగు ప్రజల దృష్టిలో ఎన్టీఆర్, వైయస్ఆర్ ఇద్దరు గొప్పవాళ్ళని అన్నారు. ఇక సినిమా ఓపెనింగ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్ ఫుల్ అయిపోవడం చూస్తే సినిమాపై ఎంతో నమ్మకంతో ప్రేక్షకులు ఉన్నారని అన్నారు. ఇదిలావుంటే 'యాత్ర' సినిమా ప్రీమియర్ షో బుకింగ్ అమెరికాలో 'ఆల్మోస్ట్ ఫుల్ అయిపోవడం గమనార్హం.

లైవ్ టీవి

Share it
Top