logo
సినిమా

ఆసక్తి రేపుతున్న యాత్ర బయోపిక్ అప్డేట్..!!

ఆసక్తి రేపుతున్న యాత్ర బయోపిక్ అప్డేట్..!!
X
Highlights

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర. ఇప్పటికే షూటింగ్...

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 8 వ తేదీన గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే అంతకంటే ముందు ఫిబ్రవరి 1 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ఈ సినిమా వైఎస్ పై తీసింది కాబట్టి పెద్ద ఎత్తున అభిమానులు ఈ వేడుకకు వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారు అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. చీఫ్ గెస్ట్ గా వైయస్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తారని.. మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ వస్తారని సినీ వర్గాల్లో ప్రచారం. కాగా ఈ చిత్ర నిర్మాతలు ప్రభాస్ కు అత్యంత సన్నిహితులు. కాబట్టి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వస్తారని అనుకుంటున్నారు.

Next Story