Vijay Devarakonda: 'వరల్డ్ ఫేమస్ లవర్' రెండోరోజు కలెక్షన్స్

Vijay Devarakonda: వరల్డ్ ఫేమస్ లవర్ రెండోరోజు కలెక్షన్స్
x
Highlights

యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఓనమాలు ఫేం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైంది. ఈ...

యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఓనమాలు ఫేం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు రాశిఖన్నా , ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లా నటించారు. వాలెంటైన్స్ డే సందర్బంగా శుక్రవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1150 స్క్రీన్స్‌లో విడుదలైంది. సినిమాకి మొదటి అట నుంచే డివైడ్ టాక్ ని సంపాదించుకుంది. కానీ విజయ్ , ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కి మంచి మార్కులే పడ్డాయి.

దీనితో మొదటి రోజు ఈ సినిమా 5.53 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇవి పర్వాలేదనిపించే కలెక్షన్లే అయినప్పటికీ విజయ్ గత చిత్రం 'డియర్ కామ్రేడ్' కు మొదటి రోజు ఏకంగా 11 కోట్లు షేర్ ని రాబట్టింది. ఇక మొదటిరోజు పర్వాలేదనిపించిన వరల్డ్ ఫేమస్ లవర్ కలెక్షన్స్ రెండోరోజు మాత్రం డిలా పడిపోయాయి.. దీనితో రెండోరోజు ఈ చిత్రం కేవలం 1.96 కోట్ల షేర్ ను వసూలు చేసింది

ఇక ఈ చిత్రం 2 రోజుల కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి

నైజాం 2.96 cr

సీడెడ్ 0.59 cr

ఉత్తరాంధ్ర 0.70 cr

ఈస్ట్ 0.41 cr

వెస్ట్ 0.31 cr

కృష్ణా 0.32 cr

గుంటూరు 0.52 cr

నెల్లూరు 0.22 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.62 cr

ఓవర్సీస్ 0.84 cr

వరల్డ్ వైడ్ టోటల్ 7.49 cr

ఇక ఈ చిత్రానికి విడుదలకి ముందు 30.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ ఈ చిత్రం రెండు రోజులు పూర్తయ్యేసరికి 7.49 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 23.01 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి ఈ చిత్రం అన్ని కలెక్షన్స్ ని రాబడుతుందా లేదా అన్నది చూడాలి మరి!

ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని చార్మీ, పూరి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories