సువర్ణతో శీనయ్య రొమాన్స్.. 'వరల్డ్ ఫేమస్ లవర్' నుంచి మరో లుక్ రిలీజ్

సువర్ణతో శీనయ్య రొమాన్స్..  వరల్డ్ ఫేమస్ లవర్ నుంచి మరో లుక్ రిలీజ్
x
World famous lover (file photo)
Highlights

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'.. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. లవర్స్ డే

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'.. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న సినిమాని విడుదల చేయనున్నారు. చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ వర్క్ ని మొదలు పెట్టింది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని బయటకు వదిలిన చిత్రబృందం తాజాగా మరో పోస్టర్ ని కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది.

'నా పేరు సువర్ణ.. ఆయన పేరు శీనయ్య.. మా ఆయనే 'వరల్డ్ ఫేమస్ లవర్'.. మా శీనయ్యను ప్రేమికుల రోజున కలుద్ధాం' అంటూ శీనయ్యతో రొమాన్స్ చేస్తున్న సువర్ణ 'వరల్డ్ ఫేమస్ లవర్' పోస్టర్‌ను వదిలింది. ఈ సినిమాలో మొత్తం నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. అందులో విజయ్‌కి భార్యగా నటిస్తున్న ఐశ్వర్యా రాజేష్‌ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఐశ్వర్యా రాజేష్‌.. సువర్ణ పాత్రలో డీ గ్లామరస్‌గా కనిపిస్తుంది.

ఇక ఈ చిత్రంలో నటించే మిగిలిన హీరోయిన్స్ కి సంబంధించిన లుక్స్ ని (డిసెంబర్13) ఇజా బెల్లా, 14న క్యాథరిన్ త్రెసా, 15న రాశీఖ‌న్నాల‌కు విడుదల చేయనున్నారు. ఇక సినిమాకి సంబంధించిన టీజర్‌ను జనవరి 3 విడుదల చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది చిత్ర యూనిట్. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందించారు.

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలతో ఆకట్టుకున్న విజయ్ నోటా, దియాట్ కామ్రేడ్ సినిమాలతో నిరాశపరిచాడు. దీనితో ఇప్పుడు ఫ్యాన్స్ ఈ సినిమాపైన భారీ అంచనాలను పెట్టుకున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories